E-Paper
Advertisement

Shivaji SSS Movie: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని రిలీజ్ డేట్ ఫిక్స్.. అదొక్కటే మిస్!

Shivaji SSS Movie: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని రిలీజ్ డేట్ ఫిక్స్.. అదొక్కటే మిస్!
Advertisement

Shivaji SSS Movie:ఒకప్పుడు తన నటనతో హీరోగా తనకంటూ ఒక భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు శివాజీ(Sivaji). ముఖ్యంగా తనకు జోడిగా హీరోయిన్ లయ (Laya) తో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలా ఒకప్పుడు బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడిగా పేరు దక్కించుకున్న వీరు కాలక్రమేనా ఇద్దరు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక శివాజీ 90’స్ బయోపిక్ అని సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విలన్ పాత్రలతో తన నటనతో తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాగే లయ కూడా ఇటీవల నితిన్ ‘తమ్ముడు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆకట్టుకుంది. అలాంటి ఈ జంట మళ్లీ జంటగా చాలా కాలం తర్వాత నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని రిలీజ్ డేట్ లాక్..

సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అయింది. ఈ మేరకు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా ఒక సినిమా విడుదలవుతోంది అంటే అది థియేటర్లలోనే దాదాపుగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి తీసుకురాబోతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ చిత్రం సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ దక్కించుకుంది. ఈ మేరకు ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలను వెల్లడిస్తూ ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ వేదికగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే థియేటర్లలో విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రాబోతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Jana Nayagan: జన నాయగన్.. ముందే ఊహించా.. విడుదల ఆలస్యంపై విజయ్ స్పందన!

గతంలో లయ – శివాజీ జంటగా నటించిన చిత్రాలు ఇవే..

ఇకపోతే వీరిద్దరూ గతంలో వెండితెరపై నటించి సూపర్ హిట్ జోడిగా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా లయ – శివాజీ కాంబినేషన్ అనగానే అభిమానులలో ఎన్నో అంచనాలు నెలకొంటాయి. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో స్వయంవరం, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి చిత్రాలు వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి బ్రహ్మరథం పట్టాయి. ఇప్పుడు మళ్లీ ఒక వెరైటీ టైటిల్ తో ఇప్పుడు క్రైమ్ ఎలిమెంట్స్ కలిసిన కామెడీ ఎంటర్టైనర్ తో వీరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. మరి ఫిబ్రవరి 12న ఓటిటి ప్లాట్ఫారం లోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్స్ ఇమ్మానుయేల్, ధనరాజ్ ,ఆటో రాంప్రసాద్ తో పాటు సీనియర్ హీరో అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×