E-Paper
Advertisement

Nari Nari Naduma Murari: శర్వాకు కాస్త తుత్తర ఎక్కువే… నారీ నారీ నడుమ మురారి టీజర్ డేట్ లాక్

Nari Nari Naduma Murari: శర్వాకు కాస్త తుత్తర ఎక్కువే… నారీ నారీ నడుమ మురారి టీజర్ డేట్ లాక్
Advertisement

Nari Nari Naduma Murari: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా శర్వానంద్ నారి నారి నడుమ మురారి (Nari Nari Naduma Murari:)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నిర్మాతలు మరొక అప్డేట్ వెల్లడించారు. ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం ఒక వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా వెన్నెల కిషోర్ శర్వానంద్ ను చూడగానే ఇంత కాంపిటీషన్లో నీ ఎంట్రీ అవసరమా? అంటూ మాట్లాడగా ప్రతి పండుగకు కొడతాము ఈ పండుగకు కూడా కొడదామని అంటూ శర్వానంద్ చెప్పగా వీడికి తుత్తర ఎక్కువే అంటూ వెన్నెల కిషోర్ చెప్పడం అందరిని ఆకట్టుకుంది.

ఇప్పుడు నీ ఎంట్రీ అవసరమా..

ఇక ఈ వీడియోని విడుదల చేస్తూ ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. ఈ సినిమా టీజర్ ను డిసెంబర్ 22వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. అలాగే ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న విషయాన్ని కూడా చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని తెలుస్తుంది. ఇదివరకు శర్వానంద్ సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలను విడుదల చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

చిరంజీవి, ప్రభాస్ కు పోటీగా..

Advertisement

ఈయన నటించిన శతమానం భవతి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సమయంలో బాలకృష్ణ చిరంజీవి సినిమాలు విడుదలైనప్పటికీ శతమానం భవతి సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోలతో పోటీగా శర్వానంద్ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రవితేజ, చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి.

Advertisement

ఇలా ఈ సినిమాలకు పోటీగా శర్వానంద్ సైతం నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాకు భాను భోగ వరకు కథ అందించగా ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా శర్వానంద్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు శర్వానంద్ బైకర్ అనే సినిమాలో కూడా నటించారు ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడటంతో సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read; The Rajasaab: రాజా సాబ్ నుంచి మరో ట్రైలర్..ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×