// // Nari Nari Naduma Murari Teaser: ఎక్స్ - ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ మధ్య శర్వానంద్.. -->
E-Paper
Advertisement

Nari Nari Naduma Murari Teaser: ఎక్స్ – ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ మధ్య శర్వానంద్.. సంక్రాంతికి సెట్ అవుతుందా?

Nari Nari Naduma Murari Teaser: ఎక్స్ – ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ మధ్య శర్వానంద్.. సంక్రాంతికి సెట్ అవుతుందా?
Advertisement

Nari Nari Naduma Murari Teaser: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). రామ్‌ అబ్బరాజు దర్శకత్వలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్‌ లవ్‌ అండ్‌ కామెడీ డ్రామా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ వేగవంతం చేసిన మూవీ టీం తాజాగా టీజర్‌ రిలీజ్ చేసింది. టీజర్‌ మొత్తం కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగింది. ఈ టీజర్‌లో కామెడీ హైలెట్‌ అయ్యింది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ

Advertisement

అమ్మాయిల స్కూటీ నడిపే విధానం, ఇద్దరు ప్రియురాళ్లు ఒకే ఆఫీసులో ఉంటే ప్రియుడి పడే పాట్లు. ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ మేనేజర్‌గా వస్తే ఎలా ఉంటుందనే అంశాలను డైరెక్టర్ల‌ సరదాగా, కామెడీగా ప్రేక్షకులకు అందించబోతున్నాడని టీజర్‌ చూస్తుంటే అర్థమైపోతుంది. ప్రతి డైలాగ్‌, ప్రతీ సీన్‌ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు స్కూటీ నడుపే మీమ్ టీజర్లో వాడారు. హీరో సునీల్ మధ్య సన్నివేశంలో అమ్మాయిలు స్కూటీ ఎలా నడుపుతారో మీకు తెలిసిన విషయమే.. బ్రేక్‌లు పట్టాల్సిన టైంలో రెండు కాళ్లు పెట్టి ఆపింది సర్.. అంటే ఎందుకలా చేసిందనగానే.. తనకి తన కాళ్ల మీదే నిలబడ్డం ఇష్టం సర్ అనే డైలాగ్ విపరీతంగా నవ్విస్తుంది. 

టీజర్ రివ్యూ

Advertisement

ఈ సీన్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. అలా అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీతో  ‘నారి నారి నడుమ మురారి’ టీజర్‌ ఆకట్టుకుంటుంది.  ప్రస్తుతం ఈ టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది.  ఆఫీసులో ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెతో పెళ్లికి సిద్ధమవుతాడు. అదే టైంలో తన ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఆఫీసులో వారికి మేనేజర్‌గా వస్తుంది. ఆ తర్వాత హీరో జీవితంలో ఏం జరిగిందనేదే ఈ నారి నారి నడుమ మురారి మూవీ కథ అని అర్థమైపోతుంది. ఇక హీరో ఆటోలో వెళ్తున్న సీన్‌తో టీజర్‌ మొదలైంది. అర్థరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు సర్‌ అని అడిగితే.. పెళ్లి కూతురిని తీసుకురావడానికి అని చెప్పూ సమాధానం ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో శర్వా తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఇక ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రలో శర్వా ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ అందించనున్నాడనిపిస్తోంది. ఈ సినిమాలో నటుడు నరేష్‌ శర్వా తండ్రిగా కనిపించబోతున్నాడు. సునీల్‌, వెన్నెల కిషోర్‌, సత్య ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా.. మరో యంగ్ హీరో శ్రీ విష్ణు ఇందులో అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర్‌, రామ బ్రహ్మం సుంకరలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి కానుగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×