E-Paper
Advertisement

Biker Trailer: ఒకరిది డ్రీమ్..ఒకరిది కెరీర్ ఆసక్తికరంగా శర్వా బైకర్ ట్రైలర్..

Biker Trailer: ఒకరిది డ్రీమ్..ఒకరిది కెరీర్ ఆసక్తికరంగా శర్వా బైకర్ ట్రైలర్..
Advertisement

Biker Trailer: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వారిలో నటుడు శర్వానంద్(Sharwanand) ఒకరు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే త్వరలోనే ఈయన మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ మూడో తేదీ శర్వానంద్ బైకర్ (Biker)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు శర్వానంద్ నటించని జానర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శర్వానంద్ తండ్రి పాత్రలో రాజశేఖర్..

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసిందే. రేసింగ్ అంటే ఎంతో ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎలా కష్టపడ్డారనేది ఈ ట్రైలర్ లో చూపించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు రాజశేఖర్(Rajasekhar) నటించిన సంగతి తెలిసిందే. ఇక తండ్రి కొడుకులుగా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు అద్భుతంగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. చిన్నప్పటినుంచి రేసింగ్ లో తన కొడుకుకు శిక్షణ ఇస్తూ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో తండ్రి పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.

బైకర్ అంటే స్పీడ్ కాదు.. రెస్పెక్ట్ …

Advertisement

ఇక ట్రైలర్ లో నువ్వు అందరికంటే ముందు రాలేదు అందరూ నీకంటే వెనుక వచ్చారు. రెండింటికి చాలా తేడా ఉంది. ఒకరిది కెరియర్ మరొకరిది కల, బైకర్ అంటే స్పీడ్ కాదు.. రెస్పెక్ట్ అంటూ చివరిలో వచ్చే డైలాగ్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందనేది తెలుస్తుంది. ఇలా సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చాయి కానీ రేసింగ్ నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు.

Advertisement

ఇలా మొదటిసారి రేసింగ్ జానర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని యు .విక్రియేషన్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి(Abilash Reddy) కంకర దర్శకత్వం వహించారు.మాళవిక నాయర్ (Malavika Nair)హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందించబోతోందనేది తెలియాల్సి ఉంది. నారి నారి నడుమ మురారి తర్వాత శర్వా నటించిన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

Also Read: Manchu Manoj: కోడలు విద్యాకు అండగా మను మామ.. భావోద్వేగ పోస్ట్ చేసిన మనోజ్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×