E-Paper
Advertisement

Biker Movie : శర్వానంద్ ‘బైకర్ ‘ బిజినెస్ క్లోజ్.. టార్గెట్ పెద్దదే..!

Biker Movie : శర్వానంద్ ‘బైకర్ ‘ బిజినెస్ క్లోజ్.. టార్గెట్ పెద్దదే..!
Advertisement

Biker Movie : టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ రీసెంట్గా నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. కొంతకాలంగా హిట్ సినిమా కోసం వెయిట్ చేసిన శర్వాకు ఈ మూవీ తో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బైకర్ సినిమాలో నటిస్తున్నాడు శర్వా.. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రాబోతుంది.. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. ఎన్ని కోట్లకు బిజినెస్ పూర్తయింది..? ఈ మూవీ టార్గెట్ ఎంత అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

భారీ ధరకు బిజినెస్ క్లోజ్..

‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. బరువు తగ్గి, తన పాత చార్మ్‌ను తిరిగి తెచ్చుకున్నాడు.. రిప్రెషింగ్ తర్వాత ఆయన మరోసారి తన లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.. ఈ సినిమా సక్సెస్‌తో శర్వానంద్ మళ్లీ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. శర్వ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో ఫామ్ లోకి వచ్చాడు. దాంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న బైకర్ మూవీ కూడా మంచి బిజినెస్ జరిగింది. నాన్-థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.35 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ రైట్స్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నారు. మొత్తానికి ఈ మూవీ భారీగానే బిజినెస్ చేసుకొని పెద్ద టార్గెట్ ని పెట్టుకుంది..

Advertisement

Also Read :బిగ్ బాస్ కు వెళ్లి తప్పు చేశాను.. నెలకు 2 లక్షల ఖర్చు..? సీతూ కామెంట్స్..

శర్వానంద్ నెక్స్ట్ ప్రాజెక్స్ట్..

హీరో శర్వానంద్ నటించిన రీసెంట్ సినిమాలు నారి నారి నడుమ మురారి, బైకర్.. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి.. రీసెంట్గా సంక్రాంతి కానుకగా వచ్చిన నారి నారి నడుమ మురారి బిగ్గెస్ట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న బైకర్ చిత్రం ఏప్రిల్ 3న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఏ మూవీ తర్వాత మరో రెండు ప్రాజెక్టులను శర్వా లైన్లో పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ ఏడాది చివర్లో ఆ సినిమాను విడుదల చేయనున్నాడు. దీని తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించనున్నాడు.. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. మొత్తానికి శర్వా మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు.. ఈ సినిమాలలో ఏ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడో చూడాలి..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×