E-Paper
Advertisement

Shanmukh Jaswanth:వైష్ణవితో ఘనంగా జరిగిన షణ్ముఖ్ జశ్వంత్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్..

Shanmukh Jaswanth:వైష్ణవితో ఘనంగా జరిగిన షణ్ముఖ్ జశ్వంత్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్..
Advertisement

Shanmukh Jaswanth: యూట్యూబ్‌తో కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు సినిమాల వరకు ఎదిగిన యువ నటుడు షణ్ముఖ్ జశ్వంత్ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. తాజాగా ఆయన ఎంగేజ్మెంట్ చేసుకుని తన అభిమానులకు ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా..అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.

షణ్ముఖ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. యూట్యూబ్‌లో చేసిన వెబ్ సిరీస్‌లతో యువతను బాగా ఆకట్టుకున్నాడు. కామెడీ, ఎమోషన్, రొమాన్స్ అన్నీ కలిపి నటించే ఆయన శైలికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అదే క్రేజ్‌తో వెండి తెరపైకి అడుగుపెట్టి, ఓటీటీలో కూడా తనదైన మార్క్ చూపిస్తున్నాడు.

Advertisement

అమ్మాయి ఎవరంటే..?

ఇప్పుడు ఆయన జీవిత భాగస్వామిగా.. మారబోయే అమ్మాయి పేరు వైష్ణవి. ఎంగేజ్మెంట్ ఫోటోల్లో వైష్ణవి సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది. షణ్ముఖ్ కూడా ఎంతో ఆనందంగా, నవ్వుతూ కనిపించాడు. ఇద్దరి జంట చాలా చక్కగా ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అప్పట్లో ఆమెతో ప్రేమ..!

Advertisement

గతంలో షణ్ముఖ్ పేరు .. బిగ్ బాస్ షో ఫేమస్ అయిన దీప్తి సునైనా తో కలిసి ఎక్కువగా వినిపించింది. ఇద్దరు కలిసి ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేశారు. ఇద్దరూ కొంతకాలం ప్రేమలో ఉండగా, ఆ తర్వాత పరస్పర కారణాల వల్ల విడిపోయారు. ఆ విషయం గురించి అప్పట్లో సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యింది. అయితే బ్రేకప్ తర్వాత ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై దృష్టి పెట్టారు. షణ్ముఖ్ బిగ్ బాస్ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు.

ప్రస్తుతం షణ్ముఖ్ సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఓటీటీలో విడుదలైన ‘లీలా వినోదం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘ప్రేమకు నమస్కారం’ అనే కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

మొత్తం పైన..షణ్ముఖ్ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన మలుపు తిరిగింది. అభిమానులు కూడా ఆయనకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. త్వరలో పెళ్లి తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

ALSO READ: Adhira: ఫైనల్ గా ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్ మొదలు.. హీరో, హీరోయిన్ ఎవరంటే..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×