E-Paper
Advertisement

రాధిక కంటే మంచి యాక్టర్ నేనే.. షకీలా షాకింగ్ స్టేట్ మెంట్ !

రాధిక కంటే మంచి యాక్టర్ నేనే.. షకీలా షాకింగ్ స్టేట్ మెంట్ !
Advertisement

Shakeela:ప్రముఖ యాక్టర్ షకీలా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిజానికి నేటి జనరేషన్ కి ఈమె పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పటి ఆడియన్స్ కి ఈమె ఒక ఫేవరెట్ గ్లామర్ బ్యూటీ.. 80 -90 దశకాలలో తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకొని.. వ్యాంప్ క్యారెక్టర్స్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న షకీలా అప్పట్లో స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా మలయాళంలో ఈమె సినిమాలు థియేటర్ వద్ద విడుదలవుతున్నాయి అంటే మలయాళ టాప్ సెలబ్రిటీలైన మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసుకునేవారు అంటే.. ఇక ఈమె క్రేజ్ అప్పట్లో జనాలలో ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సంచలనం సృష్టించిన ఈమె కాల క్రమేణా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది.

రాధికాపై షకీలా షాకింగ్ స్టేట్మెంట్..

కానీ గత మూడేళ్ల క్రితం తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ అనూహ్యంగా రెండవ వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. గత ఏడాది ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 28 ఏళ్ల సినీ కెరియర్ లో తనకు ఏ ఒక్క అవార్డు ఫంక్షన్ కి ఆహ్వానం లభించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఈమె.. తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొని రాధిక క్యారెక్టర్ పై షాకింగ్ కామెంట్లు చేసింది.

ఆమె కంటే నేనే బాగా చేసేదాన్ని..

Advertisement

ఇలాంటి సమయంలో ఒక తమిళ్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ..” ‘తాయ్ కిళవి’ సినిమాలో రాధికా బదులు నేను ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. ఈమధ్య ఒక తెలుగు సినిమాలో మేకప్ లేకుండా నటించాను. ముఖ్యంగా ఆ రోల్ నాకు చాలా అద్భుతమైన కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. అందుకే రాధికా కంటే నేనే బాగా చేసేదాన్ని అనిపించింది. అంతేకాదు ఆమె కంటే నేనే మంచి నటిని” అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది షకీలా.ఇక ప్రస్తుతం షకీలా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేస్ ఫైల్.. బాధాకరం అంటూనే మంచు మనోజ్ షాకింగ్ పోస్ట్!

పాత్రలో ఒదిగిపోయిన రాధిక..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. సీనియర్ స్టార్ బ్యూటీ రాధిక ఇటీవల ‘తాయ్ కిళవి’ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఈ సినిమాలో రాధికా తప్ప మరో నటిని ఊహించుకోలేము అనే రేంజ్ లో ఆడియన్స్ కూడా కామెంట్లు చేశారు. బామ్మ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. హీరో శివ కార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. హాట్ స్టార్ ఓటీటిలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా బాగా అలరించింది. ముఖ్యంగా తమిళనాడులోని ‘ఉసిలంపట్టి’ ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితం, ఆమె కుటుంబం చుట్టూ సాగే కథే ఈ సినిమా.. అమ్మాయిలు ఈ సినిమాను కచ్చితంగా చూడాలని.. చూస్తే వాళ్ల ఆలోచనలు, ఆర్థిక ఆలోచనలు పూర్తిగా మార్చుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×