E-Paper
Advertisement

కోట్లు విలువచేసే 3 అపార్ట్మెంట్లు కొన్న షారుఖ్  మేనేజర్ పూజ.. ఈమె ముందు హీరోయిన్లు కూడా వేస్టే!

కోట్లు విలువచేసే 3 అపార్ట్మెంట్లు కొన్న షారుఖ్  మేనేజర్ పూజ.. ఈమె ముందు హీరోయిన్లు కూడా వేస్టే!
Advertisement

Shahrukh Khan Manager: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)ఒకరు. సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షారుక్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక షారుఖ్ ఖాన్ వద్ద ఆయన మేనేజర్ గా గత కొన్ని సంవత్సరాలుగా పూజ దద్లానీ పని చేస్తున్నారు. ఈమె షారుక్ ఖాన్ సినిమాలతో పాటు, ఆర్థిక వ్యవహారాలన్నింటిని కూడా చక్కబెడుతూ ఉంటారు.

ఏడాదికి రూ .9 కోట్ల పారితోషికం ..

ఇక పూజ దద్లానీ 2012 నుండి షారుఖ్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్న ఆమె, కేకేఆర్ ఐపీఎల్ జట్టు, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవహారాలను కూడా చక్కబెడుతున్నారు. ఇక ఈమె షారుఖ్ ఖాన్ వద్ద మేనేజర్ గా పని చేస్తూ ఏడాదికి 9 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారని చెప్పాలి. ఇలా షారుఖ్ ఖాన్ మేనేజర్ గా పనిచేస్తున్న పూజ ఇప్పటివరకు భారీ స్థాయిలో ఆస్తులను కూడ పెట్టారు. ఇకపోతే తాజాగా పూజ ముంబైలో మరో మూడు అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. పూజా దద్లానీ, ఆమె భర్త హితేష్ ప్రకాష్ గుర్నానీ, ఆమె తండ్రి మోహన్ సియోరామ్ దద్లానీతో కలిసి ముంబైలో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం.

రూ.38.21 కోట్ల విలువైన ఆస్తులు..

Advertisement

ముంబైలో ఎక్కువగా సెలబ్రిటీలు నివసించే ఖరీదైన బాంద్రా ప్రాంతంలో రూ.38.21 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారు.ఈ అపార్ట్‌మెంట్లు కార్టర్ రోడ్‌లోని వరుణ్ అనే భవనంలో రీ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ లను లోటస్ డెవలపర్స్ సంస్థ అయిన ట్రైక్షా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నుంచి కొనుగోలు చేశారు. ఇక ఈ అపార్ట్మెంట్లలో ప్రతి ఒక్క అపార్ట్మెంట్
1,511.15 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 81.16 చదరపు అడుగుల బాల్కనీ ఏర్పాటు చేయబడింది. మొత్తం ఆరు కారు పార్కింగ్లతో ఏర్పాటు చేయబడి ఉంది. రీ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ 2028వ సంవత్సరంలో వీరి సొంతమవుతుంది.

రూ. 50 కోట్ల నికర ఆస్తులు..

Advertisement

పలు నివేదికల ప్రకారం ఏప్రిల్ 21, 2026న, రూ.2.16 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు రూ.90,000 రిజిస్ట్రేషన్ ఫీజుతో నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈమె తన భర్త తండ్రితో కలిసి ఏకంగా మూడు అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారనే విషయం తెలియడం నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె నికర ఆస్తుల విలువ సుమారు 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇలా ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించారనే విషయం తెలిసిన నెటిజన్లు పూజ దద్లానీ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోరని ఈమె సంపాదన ముందు హీరోయిన్లు కూడా వేస్టే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: పరమపద సోపానం రివ్యూ.. బిగ్ బాస్ అర్జున్ అంబటి రివేంజ్ డ్రామా ఎలా ఉందంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×