E-Paper
Advertisement

అల్లు అర్జున్ ‘రాకా ‘ పోస్టర్ పై షారుక్ ఆసక్తికర పోస్ట్.. నీ లాగే పోస్టర్ కూడా ఉందంటూ!

అల్లు అర్జున్ ‘రాకా ‘ పోస్టర్ పై షారుక్ ఆసక్తికర పోస్ట్.. నీ లాగే పోస్టర్ కూడా ఉందంటూ!
Advertisement

Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు అల్లు అర్జున్ తన పుట్టినరోజులు జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు అభిమానులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో నేడు ఈయన అట్లీ(Atlee) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా నుంచి ఒక టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఇలా టైటిల్ తో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రాక్షసుడి వేషధారణలో అల్లు అర్జున్ లుక్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమాకు రాకా (Raaka) అనే టైటిల్ పెట్టినట్లు వెల్లడించారు.

నీలాగే పోస్టర్ కూడా ఆసక్తిగా ఉంది..

ఇలా అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు అభిమానులు ఈ పోస్టర్ పై వారి అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సైతం ఈ పోస్టర్ ను తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షారుఖ్ ఖాన్ రాకా సినిమాకు సంబంధించిన పోస్టర్ ను షేర్ చేస్తూ… అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈరోజు విడుదల చేసిన రాకా సినిమా పోస్టర్ అచ్చం నీలాగే ఈ పోస్టర్ కూడా ఎంతో ఆసక్తికరంగా, అద్భుతంగా ఉంది. మీరందరూ కలిసి ఎలాంటి సినిమాని రూపొందిస్తున్నారు చూడటం కోసం నేను ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

మాస్… మాస్.. మాసేస్..

Advertisement

ఈ అనుభవాన్ని తాను డైరెక్టర్ అట్లీ మాటలలో చెప్పాలంటే మాస్… మాస్.. మాసేస్ రాకా చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఆల్ ద బెస్ట్ అంటూ షారుఖ్ ఖాన్ ఈ సినిమా పోస్టర్ పై చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సినిమా పట్ల బాలీవుడ్ స్టార్ట్ సైతం స్పెషల్ పోస్ట్ చేయడంతో పాటు సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని చెప్పడంతో ఈ సినిమా పట్ల ఎలాంటి బజ్ ఉందో స్పష్టం అవుతుంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అట్లీ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాకు రాకా అనే టైటిల్ పెట్టడంతో సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అట్లీ డైరెక్షన్ లో నటుడు షారుఖ్ ఖాన్ సైతం జవాన్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే .ఈ సినిమా బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ నటించిన నేపథ్యంలో అట్లీపై కూడా ప్రశంసలు కురిపించారు.

Also Read: ఎనిమిదేళ్ల ప్రేమ… ఎన్నో అవమానాలు, గొడవలు. బ్రేకప్ వరకూ వెళ్ళిన ఫైమా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×