E-Paper
Advertisement

Jailer 2: రజినీకాంత్ సినిమాలో షారుక్ ఖాన్ షాకింగ్ పాత్ర… ఎలా కనిపించనున్నారంటే..!

Jailer 2: రజినీకాంత్ సినిమాలో షారుక్ ఖాన్ షాకింగ్ పాత్ర… ఎలా కనిపించనున్నారంటే..!
Advertisement

Jailer 2: ఇండియన్ సినిమా అభిమానుల్లో ఇప్పుడు పెద్దగా చర్చకు వస్తున్న సినిమా జైలర్ 2. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమాకు సంబంధించిన మరో సంచలన విషయం ఏమిటంటే, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను.. షారుక్ ఖాన్ ఇద్దరూ జైలర్ 2లో అతిథి పాత్రల్లో నటిస్తున్నామని చెప్పడంతో ఈ వార్తలు నిజమనే నమ్మకం పెరిగింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో షారుక్ పాత్రపై ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాలో రజినీకాంత్ పాత్ర తీవ్రమైన సమస్యల్లో చిక్కుకున్న సమయంలో అతడికి అండగా నిలిచే నమ్మకమైన వ్యక్తిగా షారుక్ ఖాన్ ఎంట్రీ ఉంటుందట. ఈ ఎంట్రీ థియేటర్‌లో మాస్ క్షణాలుగా ఉండేలా డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మొదటి భాగమైన జైలర్‌లో ఇలాంటి పాత్రల్లో మోహన్‌లాల్ మరియు శివ రాజ్‌కుమార్ కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

అయితే.‌. కొందరు అభిమానులు మాత్రం అంచనాలు అతిగా పెంచుకోవద్దని సూచిస్తున్నారు. గతంలో ‘కూలీ’ సినిమాలో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రపై భారీ హైప్ ఏర్పడినా, ఆ పాత్ర కథపై పెద్దగా ప్రభావం చూపలేదని గుర్తు చేస్తున్నారు. అందుకే షారుక్ ఖాన్ పాత్రను దర్శకుడు జాగ్రత్తగా..బలంగా చూపించాలని అభిమానులు కోరుతున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా, విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నానని స్వయంగా నిర్ధారించారు. అలాగే ఫహాద్ ఫాసిల్, ఎస్.జే. సూర్య, సూరజ్ వెంజరమూడ్, సంతానం, విద్యా బాలన్ వంటి ప్రముఖులు కూడా క్యామియో పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇన్ని పెద్ద నటుల క్యామియోలు, సీక్వెల్‌పై ఉన్న భారీ అంచనాలతో జైలర్ 2 ఈ ఏడాది అత్యంత భారీ భారతీయ సినిమాల్లో ఒకటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథనం బలంగా ఉంటే, ఈ సినిమా కోలీవుడ్‌లో తొలి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించే చిత్రంగా నిలవవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ALSO READ: Allu Sirish Nainika: ‘వావ్ మ్యాగజైన్’ కవర్ పేజీపై కాబోయే భార్యతో అల్లు శిరీష్ ..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×