E-Paper
Advertisement

Shahrukh Khan: పుట్టినరోజు వేళ నిరాశలో అభిమానులు.. క్షమాపణలు చెప్పిన షారుక్ !

Shahrukh Khan: పుట్టినరోజు వేళ నిరాశలో అభిమానులు.. క్షమాపణలు చెప్పిన షారుక్ !
Advertisement

Shahrukh Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న షారుక్ ఖాన్ (Shahrukh Khan) నేడు తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. షారుక్ ఖాన్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక స్టార్ హీరో పుట్టినరోజు అంటే అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుంది అంటే అభిమానులకు ఒక పండుగ రోజు అని చెప్పాలి అంత ఘనంగా వారి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు.

నిరాశతో వెనుతిరిగిన అభిమానులు..

ఇక హీరోల పుట్టినరోజు వస్తే చాలు అభిమానులు పెద్ద ఎత్తున ఆ హీరో ఇంటి పరిసర ప్రాంతాలలో చక్కర్ల కొట్టడమే కాకుండా తమ అభిమాన హీరోని చూసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి అంటూ వారి ఇంటి ముందు పడిగాపులు కాస్తూ ఉంటారు. అయితే నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు(Birthday) జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయింది. తమ అభిమాన హీరో బయటకు వచ్చి తమని కలుస్తారని ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులను షారుఖ్ పలకరించలేకపోయారు. ఈ విషయంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేయడమే కాకుండా అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు.

అభిమానుల భద్రత కోసమే..

Advertisement

ఈ సందర్భంగా షారుక్ ఖాన్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు అయితే నా నిర్ణయం మీ భద్రత కోసమేనని తెలిపారు. ఇక అభిమానులు తన పట్ల చూపిస్తున్న ప్రేమ , ఆప్యాయత పట్ల షారుక్ ఖాన్ స్పందిస్తూ మీ నమ్మకం మీ ఆప్యాయత నాకు అత్యంత విలువైనది మిమ్మల్ని చూడలేకపోయినా మీకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. అతి త్వరలోనే మీ అందరిని కలుసుకొని నా ప్రేమను తెలియజేయడం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. ఇలా పుట్టినరోజున తన అభిమానులను కలవలేకపోయిన నేపథ్యంలోనే షారుఖ్ ఖాన్ తన అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు.

Advertisement

ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన పెద్ద ఎత్తున తొక్కిసలాట జరుగుతున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే షారుఖ్ ఖాన్ బయటకు రాకపోవడమే మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇలా షారుక్ ఖాన్ బయటకు వస్తారని ఎదురు చూసిన అభిమానులు నిరాశతో అక్కడి నుంచి వెనక్కి తిరిగారు. ఇక పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేశారు. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నటుడు అయినప్పటికీ ఈయనకి కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Singer Chinmayi: కర్మ వదిలిపెట్టదు.. జానీ మాస్టర్ పై సింగర్ చిన్మయి సంచలన పోస్ట్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×