E-Paper
Advertisement

మేము గుర్తులేమా? ఖుష్బూపై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

మేము గుర్తులేమా? ఖుష్బూపై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!
Advertisement

Khushboo:ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇటు సినిమాలలో నటిస్తూనే.. అటు సామాజిక అంశాలపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు బిజీగా మారిన ఈమె.. ఇటీవల తన కుమార్తె అవంతిక పెళ్లిని గోవాలో జరిపించిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నా లాంటి సెలబ్రిటీలు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. పైగా ఈ సెలబ్రిటీలు తమ దుస్తులతో ధరించిన జ్యూవెలరీతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు కూడా.. ఇక దాంతో అవంతిక పెళ్లి కొన్ని రోజుల క్రితం టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.

ఖుష్బూ పై అలిగిన సీనియర్ నటుడు..

ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఈ వేడుకకు తనను పిలవలేదు అని, వారు అవసరానికి వాడుకుంటారు అంటూ ప్రముఖ సీనియర్ నటుడు రాధా రవి అసంతృప్తి వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఖుష్బూ కూతురు పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? అని ప్రశ్నించగా.. దీనికి ఆయన మాట్లాడుతూ.. “ఖుష్బూ తన కూతురు పెళ్లికి నన్ను పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్లడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళ స్థాయి చాలా పెద్దది అయిపోయిందేమో నాకు తెలియదు.. కనీసం సుందర్ అయినా నన్ను పెళ్లికి పిలుస్తారు అనుకున్నాను. ఆయన కూడా ఆహ్వానించలేదు. ముఖ్యంగా వాళ్ళ కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహిత బంధం కొనసాగుతోంది కదా ఖచ్చితంగా పెళ్లికి పిలుస్తారు అనుకున్నాను.

Advertisement

ALSO READ:అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా.. 15 ఏళ్లు నరకం చూశా -యాక్టర్ బాలాజీ!

అవసరానికి వాడుకునే రకాలు..

నిజానికి సుందర్ మధురై నుంచి ఎన్నికలలో పోటీ చేయడానికి బయలుదేరినప్పుడు శుభాకాంక్షలు చెప్పింది కూడా నేనే.. ఆ విషయాలు వారు మర్చిపోయారేమో.. అందుకే నన్ను పిలవలేదు. నిజానికి వాళ్లు కొందరినే పిలవాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. ఒకవేళ నన్ను పిలిచి ఉంటే తప్పకుండా నేను వెళ్లేవాడిని. ఎన్నికల సమయంలో నా పూర్తి మద్దతు నేను వారికే ఇచ్చాను. ఇప్పుడు నా అవసరం లేకపోయి ఉండొచ్చు అంటూ రాధా రవి కామెంట్లు చేశారు. మొత్తానికైతే తనను పెళ్లికి పిలవకపోవడం పై హర్ట్ అయిన రాధా రవి ఈ విధంగా కామెంట్లు చేశారు.

ఖుష్బూ, సుందర్.సీ లతో రాధా రవికి ప్రత్యేక అనుబంధం..

Advertisement

ఇకపోతే ఖుష్బూ సుందర్ దంపతులతో రాధా రవికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఖుష్బూ తో కలిసి అన్నామలై, మన్నన్, చిన్న తంబి వంటి చిత్రాలలో రాధా రవి నటించగా..అలాగే సుందర్ దర్శకత్వం వహించిన అరుణ్మనై , అరుణ్మనై 2 చిత్రాలలో కీలకపాత్రలు పోషించారు. అటు రాజకీయంగా కూడా తాను మద్దతు ఇచ్చానని , అయినా సరే తనను పెళ్లికి పిలవలేదు అంటూ బాధపడ్డారు రాధా రవి. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై ఖుష్బూ దంపతులు ఏ విధంగా అయినా స్పందిస్తారేమో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×