E-Paper
Advertisement

Akhanda 2: అప్పుడు పండిట్స్.. ఇప్పుడు సిస్టర్స్.. తమన్ మాస్టర్ ప్లాన్ వెనుక కారణం?

Akhanda 2: అప్పుడు పండిట్స్.. ఇప్పుడు సిస్టర్స్.. తమన్ మాస్టర్ ప్లాన్ వెనుక కారణం?
Advertisement

Akhanda 2:టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు ఎస్.తమన్ (S.Thaman). ఇకపోతే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ఆరంభించి ఎన్నో సంవత్సరాలవుతోంది. అలాంటి ఆయన కెరియర్ లో బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మొన్నటి వరకు అఖండ (Akhanda) అని ఎంతోమంది చెప్పేవారు. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ మూవీకి తమన్ అంతకుమించిన బీజీఎంలు అందించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కోసం తమన్ ఇచ్చిన బీజీఎం ఇప్పటివరకు ఎక్కడ వినలేదు అని.. అదిరిపోయిందని చాలామంది కామెంట్లు కూడా చేశారు. ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన తర్వాత కూడా ఈ చర్చ మరింత ఎక్కువైంది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈసారి ఓజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి అఖండ 2 సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

అఖండ 2.. నేడు రంగంలోకి సర్వేపల్లి సిస్టర్స్..

ఇదిలా ఉండగా అఖండ 2 సినిమా కోసం తమన్ చాలా గట్టిగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడో ఉన్న ప్రతిభను తీసుకొచ్చి అఖండ 2 తాండవం కోసం పనిచేయిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే సాహిత్యంతో పాటు సనాతన ధర్మం కలిసి ఉండేలా మిశ్రా సోదరులు (శ్రవణ్ మిశ్రా , అతుల్ మిశ్రా)ను తీసుకొచ్చి అద్భుతమైన పాటను పాడించిన తమన్.. ఇప్పుడు “సర్వేపల్లి సిస్టర్స్” తో కూడా అఖండ 2 కోసం పాటలు పాడించారు. ఇకపోతే ఈయన ఈ సినిమాలో సర్వేపల్లి సిస్టర్స్ చేత పాట పాడించారా లేకపోతే బిజిఎం కోసం కోరస్ ఇప్పించారా అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే తాజాగా ఈ సిస్టర్స్ ఇద్దరితో కలిసి దిగిన ఫోటోలు తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ అసలు విషయాన్నీ చెప్పుకొచ్చారు తమన్. మొత్తానికైతే అప్పుడు పండిట్స్ ఇప్పుడు సర్వేపల్లి సిస్టర్స్ ను రంగంలోకి దింపారు తమన్.. మరి ప్రయత్నం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఈ చిత్రానికి ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా తమన్ ఏదో మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని.. ఈసారి ఊహించని సక్సెస్ గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Jailer 2: రజినీకాంత్ మూవీలో మరో హీరో.. గెస్ కూడా చేసుండరు భయ్యా !

అఖండ 2 సినిమా విశేషాలు..

అఖండ 2 సినిమా విషయానికి వస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గతంలో నటించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు.. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నిర్మాణ భాగంలో బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి కూడా నిర్మాణంలో భాగమైన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×