E-Paper
Advertisement

Sankranthi 2026 Movies: సంక్రాంతి బాక్సాఫీస్ వార్.. సైలెంట్ మోడ్‌లో ఆ ఇద్దరు హీరోల సినిమాలు

Sankranthi 2026 Movies: సంక్రాంతి బాక్సాఫీస్ వార్.. సైలెంట్ మోడ్‌లో ఆ ఇద్దరు హీరోల సినిమాలు
Advertisement

Sankranthi 2026 Movies: సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ది రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్  నారీ నారీ నడుమ మురారి , రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలా ఈ సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరోలందరూ వారి సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడని ప్రభాస్ సైతం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

సైలెంట్ అయిన సంక్రాంతి హీరోలు..

ఇక చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్లలో కూడా చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా రవితేజ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేశారు.  ఇలా ఈ హీరోలందరూ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), శర్వానంద్ (Sharwanand) మాత్రం ఇప్పటివరకు తమ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేదు. ఇలా ఈ ఇద్దరి హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీ ఉండబోతుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ల పై నో అప్డేట్..

Advertisement

ఈ నేపథ్యంలోనే హీరోలందరూ కూడా వారి సినిమాల ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ శర్వానంద్, నవీన్ పోలిశెట్టి మాత్రం సైలెంట్ గా ఉండటం గమనార్హం. ఈ రెండు సినిమాల ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్లు , చిత్ర నిర్మాతలు పాల్గొన్నప్పటికీ హీరోలు మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమాల ట్రైలర్ గానీ, ప్రీ రిలీజ్ వేడుకలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వెల్లడించలేదు. దీంతో ఈ సినిమాల విషయంలో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ప్రమోషన్లకు దూరంగా..

Advertisement

అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari)విషయానికి వస్తే శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 15వ తేదీ విడుదల కాగా 14వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్స్ పై ఇప్పటివరకు అధికారక ప్రకటన వెల్లడించలేదు. మరి ఇప్పుడైనా హీరోలు ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాని ముందుకు నడిపిస్తారా? లేదంటే ప్రమోషన్లకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×