E-Paper
Advertisement

Sanjay Dutt: చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ.. ఏపీ పైనా బాలీవుడ్ కన్నుపడిందా?

Sanjay Dutt: చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ.. ఏపీ పైనా బాలీవుడ్ కన్నుపడిందా?
Advertisement

Sanjay Dutt: బాలీవుడ్‌లో సినిమా పరిస్థితి రోజురోజుకూ పడిపోతున్న తరుణంలో, అక్కడి స్టార్స్ అందరూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై కన్నేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్టూడియోల నిమిత్తం పెట్టుబడులు పెట్టేందుకు.. వారు ఎంతగానో ట్రై చేస్తున్న విషయం తెలియంది కాదు. అజయ్ దేవ్‌గన్, రితేష్ వంటి వారంతా హైదరాబాద్‌లో అత్యాధునిక స్టూడియోలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) కూడా.. హైదరాబాద్‌ని సినిమా హబ్‌‌గా చేయాలని, హాలీవుడ్ వంటి సినిమా సంస్థలు కూడా ఇక్కడికే వచ్చి షూటింగ్స్ వంటివి చేసుకోవాలనే సంకల్పంతో పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సింగిల్ విండో విధానంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి అనుమతులైనా ఇచ్చేందుకు సిద్ధమని.. ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ప్రకటించారు.

Also Read- Deewana: సమంత వదిలిన ‘ఇది ప్రేమ’ సాంగ్ ఎలా ఉందంటే?

తెలుగు రాష్ట్రాలే టార్గెట్..

Advertisement

అదే వేదికపై ఏపీ రాష్ట్రం పేరు కూడా బాగా వినబడింది. మెగాస్టార్ చిరంజీవి, ఆర్ నారాయణ మూర్తి వంటి వారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu)కు కొన్ని రిక్వెస్ట్‌లు పంపించారు. కట్ చేస్తే, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Dutt), ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలు ఎవరు వచ్చినా, తెలంగాణ మరీ ముఖ్యంగా హైదరాబాద్‌నే బేస్ చేసుకుని కార్యకలాపాలు జరిపేవారు. ఇప్పుడు సంజయ్ దత్ వంటి నటుడు ఏపీ సీఎంతో భేటీ అవడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అంటే బాలీవుడ్ కన్ను.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలపై ఉందనేది స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఏపీలో సినిమా పరిశ్రమను డెవలప్ చేసేందుకు పక్కాగా ప్లాన్ రెడీ చేసినట్లుగా ఈ ఇన్సిడెంట్ తెలియజేస్తుంది. ఇదే విషయం చంద్రబాబు నోటి వెంట కూడా రావడం విశేషం.

Also Read- Venky Atluri: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్లోకి చిరుతపులి.. షాకింగ్ విషయం చెప్పిన డైరెక్టర్

ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి..

Advertisement

సంజయ్ దత్‌తో భేటీని పురస్కరించుకుని సిఎమ్ఓ అధికారిక ట్వీట్ చూస్తే.. ఏపీలో కచ్చితంగా ఏదో ప్లాన్ జరుగుతుందనేది తెలుస్తుంది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ‘‘బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నేడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ వివరించారు. సినిమా షూటింగ్‌లకు ఏపీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని సీఎం తెలిపారు..’’ అని సిఎమ్ఓ ఆంధ్రప్రదేశ్ తెలియజేసింది.

Also Read- Horror Thriller OTT : డబ్బుకోసం కన్నింగ్ ప్లాన్… అద్దెకు వచ్చి బురిడి కొట్టించే పాపలు… షాక్ ఇచ్చే సైకో డాక్టర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×