E-Paper
Advertisement

Sangeeth Shoban : నిఖిల్ దర్శకుడు తో సంతోష్ శోభన్.. మరి సుకుమార్ ఇన్వాల్వ్ అవుతారా?

Sangeeth Shoban : నిఖిల్ దర్శకుడు తో సంతోష్ శోభన్.. మరి సుకుమార్ ఇన్వాల్వ్ అవుతారా?
Advertisement

Sangeeth Shoban : ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన గోల్కొండ హై స్కూల్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. సుమంత్ నటించిన ప్రత్యేకమైన సినిమాలలో ఆ సినిమా కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో చాలామంది స్కూల్ పిల్లలు పాత్రలో నటించారు. వాళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వారిద్దరూ వాళ్లకంటూ సొంత గుర్తింపు ఇప్పుడు ఇండస్ట్రీలో సాధించుకున్నారు.

సంతోష్ శోభన్ కెరియర్ లో పేపర్ బాయ్ వంటి మంచి సక్సెస్ఫుల్ సినిమా ఉంది. అలానే ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలు వర్కౌట్ కాకపోయినా కూడా మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. యూపీ క్రియేషన్స్ లో ప్రస్తుతం ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు సంతోష్ శోభన్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అవుతుంది అని చాలామంది బలంగా నమ్ముతున్నారు. సంగీత్ శోభన్ విషయానికి వస్తే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్ తో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. జీ ఫైవ్ లో ఇప్పటికీ కూడా ఆ సిరీస్ అవైలబుల్ గా ఉంది.

నిఖిల్ దర్శకుడు తో 

Advertisement

సుకుమార్ దగ్గర ఉన్న చాలా మంది శిష్యులు ప్రస్తుతం దర్శకులుగా మారిపోతున్నారు. అందరికంటే ముందు కుమారి 21ఎఫ్ అనే సినిమాతో సూర్యప్రతాప్ పలనాటి దర్శకుడుగా మారిపోయాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. దేవిశ్రీప్రసాద్ ఆ సినిమాకి అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్. సినిమా తర్వాత రాజ్ తరుణ్ చేసిన సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు.

కార్తికేయ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా చేశాడు నిఖిల్. అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ నటించిన ఆ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు కానీ ఆ సినిమాకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు.

Advertisement

ఇప్పుడు సంగీత్ శోభన్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు చేయనున్నారు.

వరుస సక్సెస్ సినిమాలు 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో ధీరజ్ మొగిలినేని ఒకరు. రీసెంట్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో అద్భుతమైన పేరు వచ్చింది. ఈ సినిమా గురించి కొన్ని నెగిటివ్ కామెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తున్న కూడా ఈ సినిమాని విపరీతంగా పొగిడే వాళ్ళు ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారు.

ఇక సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సంగీత్ శోభన్ చేయబోయే సినిమాకు ధీరజ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు సంగీత్ శోభన్. ఆ తర్వాత హీరోగా కూడా ఎప్పుడో చేసిన ఒక సినిమా ఈ మధ్యనే విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద దానికి ఊహించిన రెస్పాన్స్ రాలేదు. ఇక ఈ సినిమా ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో ముందు ముందు తెలుస్తోంది.

Also Read: Chaitanya Jonnalagadda: విలన్ గా ఆ అరాచకం ఏంటయ్యా, టిల్లు అన్నయ్య విలనిజం

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×