E-Paper
Advertisement

Sandigdham: ‘సందిగ్ధం’లో కొత్త జంట.. ప్రేమలో గెలుస్తారా?

Sandigdham: ‘సందిగ్ధం’లో కొత్త జంట.. ప్రేమలో గెలుస్తారా?
Advertisement

Sandigdham: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలదే హవా.. అని పలు చిత్రాలు నిరూపిస్తున్నాయి. టాలీవుడ్ అనే కాదు, ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా.. కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇప్పుడదే బాటలో సరికొత్త కథాంశంతో, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది ‘సందిగ్ధం’ (Sandigdham) టీమ్. నిహాల్ (Nihal), ప్రియా దేశ్‌పాగ్ (Priya Deshpag), అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మించిన ఈ చిత్రానికి పార్థసారధి కొమ్మోజు (Parthasaradhi Kommoju) దర్శకుడు. సినిమా టైటిల్‌లోనే ఒక రకమైన క్యూరియాసిటీని నింపిన చిత్ర యూనిట్, ప్రచార చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read- psychological thriller OTT : సెబాస్టియన్ స్టాన్, ఆడమ్ పియర్సన్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీలోకి… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే?

సెన్సార్ కార్యక్రమాల్లో..

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకున్నాయి. సినిమా మేకింగ్ వాల్యూస్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ప్రామిసింగ్‌గా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా విజయవంతంగా పూర్తయ్యాయని.. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఇకపై వరుస అప్డేట్స్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేందుకు చిత్రయూనిట్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తోందట. ఈ విషయాన్ని వారే అధికారికంగా ప్రకటించారు.

Also Read- Prabhas: మలయాళ దర్శకుడితో ప్రభాస్.. కొత్త పాన్ ఇండియా సినిమాకి సర్వం సిద్ధం..!

కామెడీ, ఎమోషన్, థ్రిల్ ఎలిమెంట్స్‌తో..

Advertisement

సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా బలంగా కనిపిస్తోంది. గౌతమ్ రవిరామ్ అందిస్తున్న సంగీతం, నందన్ కృష్ణ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ జోడీగా నటిస్తుండగా.. అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల వంటి యంగ్ టాలెంట్‌.. సీనియర్ నటులు చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కామెడీ, ఎమోషన్, థ్రిల్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కలగలిసిన ఈ ‘సందిగ్ధం’లో ఈ నూతన జంట తమ ప్రేమలో గెలుస్తారో, లేదో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. డిఫరెంట్ కంటెంట్‌ను కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి చాయిస్ అవుతుందని, బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- KVN Productions: మరో మైత్రీ మూవీ మేకర్స్‌లా కెవిఎన్.. డజను హీరోలు, అరడజను దర్శకులతో?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×