E-Paper
Advertisement

Bandi Saroj: చస్తే హీరోగానే చస్తా .. విలన్ పాత్రలు చేయనన్న నటుడు..కానీ

Bandi Saroj: చస్తే హీరోగానే చస్తా .. విలన్ పాత్రలు చేయనన్న నటుడు..కానీ
Advertisement

Bandi Saroj: బండి సరోజ్ పరిచయం అవసరం లేని పేరు. సినిమాలంటే ఎంతో మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన కెరియర్ మొదట్లో దర్శకుడిగా పలు సినిమాలకు దర్శకత్వం వహించి మంచి సక్సెస్ అందుకున్నారు . అనంతరం నటుడిగా కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇలా హీరోగా పలు విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న బండి సరోజ్ తాజాగా విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

విలన్ పాత్రలు చెయ్యను..

ఈ సినిమాలో బండి సరోజ్ విలన్ పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు సందీప్ రాజ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బండి సరోజ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ సూర్యాస్తమయం సినిమా చూసి తాను ఈ పాత్రకు బండి సరోజ్ అయితే బాగుంటుందని అనుకున్నాము. ఇలా ఈ సినిమాలో పాత్ర గురించి చెబితే ఆయన నేను చేయనని చెప్పారు నేను చచ్చిపోతే హీరో గానే చస్తాను, కానీ విలన్ గా మాత్రం సినిమాలు చేయనని చెప్పారు. కానీ మేము చాలా బ్రతిమిలాడితే చివరికి ఈ సినిమాలో చేయడానికి ఒప్పించామని సందీప్ రాజ్ తెలిపారు.

విలన్ గా మెప్పించిన బండి సరోజ్ ..

Advertisement

ఈ సినిమాలో పది నిమిషాల పాటు కథ ఆయనకు నేరేట్ చేయడంతో నాకు స్టోరీ మొత్తం అర్థమైందని, మిగిలిన స్టోరీ మొత్తం తనకు పంపించమని చెప్పారు. అలా ఈ సినిమాలో అతని క్యారెక్టర్ నచ్చడం వల్లే విలన్ పాత్రలు చేయటానికి బండి సరోజ్ ఒప్పుకున్నారు అంటూ ఈ సందర్భంగా సందీప్ రాజ్ తెలియజేశారు. మరి విలన్ గా సక్సెస్ అయిన సరోజ్ తదుపరి ఇలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో విలన్ గా నటిస్తారా? లేదంటే హీరోగా దర్శకుడుగానే ఇండస్ట్రీలో కొనసాగుతారా? అనేది తెలియాల్సి ఉంది.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో…

Advertisement

ఇక మోగ్లీ సినిమా విషయానికి వస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ప్రేమ కథ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కావడంతో మంచి టాక్ సొంతం చేసుకుని ఇక నేను థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనమవుతుంది మరి ఈ సినిమాకు ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రోషన్ కి జోడిగా సాక్షి హీరోయిన్ గా నటించారు. ఇక సుమ రాజీవ్ కనకాల కుమారుడిగా రోషన్ ఇండస్ట్రీలోకి బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక రెండవ సినిమాగా నేడు మోగ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read: Aadi Sai Kumar: ఆదిసాయి కుమార్ తో సినిమాలు చేస్తే నష్టపోవాల్సిందేనా.. డబ్బు కోసమే సినిమాలు?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×