E-Paper
Advertisement

Sandeep Raj : ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా, హిట్ సినిమా చేసే ఐదేళ్ల ఇంట్లో కూర్చున్నా

Sandeep Raj : ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా, హిట్ సినిమా చేసే ఐదేళ్ల ఇంట్లో కూర్చున్నా
Advertisement

Sandeep Raj : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో సందీప్ రాజ్ ఒకరు. చాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్ లో కొన్ని వీడియోస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు సందీప్. ఆ తర్వాత కలర్ ఫోటో అనే సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. ఆ సినిమా థియేటర్లో విడుదల కాలేదు కానీ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ సాధించుకుంది. అన్నిటిని మించి ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది ప్రత్యేకం.

2020లో వచ్చిన ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సందీప్ రాజ్ కెరియర్లో దర్శకుడుగా ఒక సినిమా కూడా రాలేదు. ఇప్పుడు మోగ్లీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు సందీప్. అయితే ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఆ ఈవెంట్లో సందీప్ రాజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు.

ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేశా 

Advertisement

కలర్ ఫోటో లాంటి సూపర్ హిట్ సినిమా చేస్తేనే ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాను. అటువంటిది ఒక ప్లాప్ సినిమా చేస్తే నా కెరియర్ ఏమైపోతుందో నాకు తెలుసు. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మోగ్లీ అనే సినిమాను చేశాను. ఈ సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 13న థియేటర్లో చూడండి అదిరిపోతుంది అంటూ మాట్లాడాడు.

అలానే అఖండ సినిమాని కూడా చూడండి. మనం ఒక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న తర్వాత బయట పాన్ డబ్బా దగ్గర ఒక కిల్లి తింటాం. ఈ సినిమా అలాంటిదే, కిళ్ళి కొట్టులో దొరికే మీనాక్షి పాన్ లాంటిది ఈ సినిమా అంటూ మొగ్లీ సినిమాను పోల్చాడు సందీప్.

మారుతి జాగ్రత్తలు 

Advertisement

ఈ కథను మొదట దర్శకుడు మారుతీకి చెప్పాడట సందీప్ రాజ్. అయితే మారుతి మాట్లాడుతూ సందీప్ చాలా మంచి టాలెంటెడ్ ఎస్ కే ఎన్ అన్న ద్వారా నాకు పరిచయం ఎస్ కే ఎన్ బిస్కెట్ లో పనిచేస్తాడు బాగా టాలెంటెడ్ అని అప్పట్లో నాతో ఎస్ కే ఎన్ అని చెప్పాడు.

మంచి టాలెంటెడ్ కానీ తమ్ముడు ఎందుకు ఈ మధ్యకాలంలో ట్విట్టర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అఖండ సినిమా రావడం అనేది ఈ సినిమాకి ఇంకా పెద్ద ప్లస్ అయింది. ఎందుకంటే ఈ సినిమా కూడా ఒకటి ఉంది అని చాలా ఎక్కువమందికి రీచ్ అయింది అంటూ మారుతి చెప్పాడు. ట్విట్టర్ లో ఏమి పడితే అవి పెట్టొద్దు అంటూ జాగ్రత్తలు చెప్పాడు మారుతి.

Also Read : Maruthi : ప్రగతి గారు మిమ్మల్ని బూతులు తిడుతున్నారు కానీ మీరు పట్టించుకోకండి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×