E-Paper
Advertisement

Akhand 2 : బాలయ్య సినిమాలో సంయుక్త… కానీ, సాడ్ ఎండింగ్ ?

Akhand 2 : బాలయ్య సినిమాలో సంయుక్త… కానీ, సాడ్ ఎండింగ్ ?
Advertisement

Balayya Akhand 2 : నందమూరి బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ 2 మరో 10 రోజుల్లో థియేటర్స్‌లో రాబోతుంది. పెయిడ్ ప్రీమియర్స్‌తో ఒక రోజు ముందుగానే అంటే, డిసెంబర్ 4వ తేదీనే ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి వినిపిస్తుంది. దాని ప్రకారం… సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ఉంటుందట. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం…

అఖండ మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తుంది. అఖండ 2 తాండవం అంటూ బోయపాటి శ్రీనునే దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి… ఈ సీక్వెల్‌ను మరింత హైగా తెరకెక్కిస్తున్నారు. స్టార్ కాస్ట్ అండ్ క్రూ ను కూడా తీసుకున్నారు.

ఆర్కియాలజీ ఆఫీసర్‌గా సంయుక్త?

Advertisement

అలా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్‌ను తీసుకున్నారంట. అఖండ 2లో సంయుక్త మీనన్ ఆర్కియాలజీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే, సినిమాలో సంయుక్త మీనన్ పాత్ర చనిపోతుందట. సినిమాకు అదే టర్నింగ్ పాయింట్‌గా ఉంటుందని తెలుస్తుంది.

ఫస్ట్ పార్ట్‌లో హీరోయిన్ పూర్ణతో సినిమాన టర్న్ చేసేలా చేశాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఇప్పుడు అఖండ 2 తాండవంలో సంయుక్త మీనన్ పాత్ర అచ్చం అలానే ఉంటుందని తెలుస్తుంది. అఖండ ఫస్ట్ పార్ట్‌లో పూర్ణ పాత్ర విలన్స్‌కు సంబంధించిన నేరాలను అన్నింటినీ సాక్ష్యాలతో సహా చూపిస్తుంది. దీంతో ఆమెపై విలన్ శ్రీకాంత్ అఘాయిత్యానికి పాల్పడుతాడు. అవమానంతో పూర్ణ పాత్ర సూసైడ్ అటెంప్ట్ చేసింది.

Advertisement

ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీలో సంయుక్త పాత్ర.. ఆర్కియాలజీ ఆఫీసర్‌. ఆమె విలన్ ఆది పినిశెట్టి చేసిన నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను సంపాదిస్తుందట. దీంతో ఆది పినిశెట్టి గ్యాంగ్.. సంయుక్త మీనన్‌ను చంపేస్తారని తెలుస్తుంది. దీని పూర్తి వివరాలు అంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

చనిపోయే పాత్ర కోసం సంయుక్త ఎందుకు?

బాలయ్య సినిమాలో సంయుక్త మీనన్ ఉంది అంటే అది ఫ్యాన్స్ కిక్ ఇవ్వొచ్చు. అయితే ఆ పాత్రను ఫుల్ లెన్త్ గా కాకుండా సాడ్ ఎండింగ్ లా పెట్టడం ఆమె ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే క్వశ్చన్ అయితే ఉంది. ఇలా.. సాడ్ ఎండింగ్ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ హీరోయిన్ ను కాకుండా మిడ్ రేంజ్ హీరోయిన్‌ను తీసుకుంటే బాగుండు అనే మాటలు సినిమా రిలీజ్ తర్వాత వినపడే ఛాన్స్ ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×