E-Paper
Advertisement

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్
Advertisement

Sameera Revelations:సమీరా రెడ్డి….తారక్ ‘అశోక్’, చిరంజీవి ‘జై చిరంజీవి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ తెలుగందం ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇపుడు ఇండస్ట్రీలో మంటలు పుట్టిస్తున్నాయి.ఇక్కడ నటన వస్తే సరిపోదని అంతకు మించి ఇంకేదో కావాలని,సరిగ్గా చెప్పాలంటే తెరపై ఫిగర్ సరిగ్గా సెట్ అవ్వాలని లేకపోతె ఇక్కడ రాణించలేమంటూ ఇండస్ట్రీలో ఆర్టీఫీషియల్ అందాలకి ఎంత విలువ ఇస్తారో చెప్పుకొచ్చింది.

హీరోయిన్‌గా ఉన్న రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు

Advertisement

ఇక ఇదే క్రమంలో తనపై తెచ్చిన ఒత్తిళ్ల గురించి కూడా ఏ మాత్రం జంకకుండా కుండ బద్దలు కొట్టేసింది.తాను హీరోయిన్‌గా ఉన్న రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు (బమ్ ప్యాడ్స్) పెట్టుకోమని దర్శక,నిర్మాతలు విపరీతంగా ఒత్తిడి తెచ్చేవారని,బ్లౌజుల్లో ప్యాడింగ్ పెట్టడం సరే,”నీ బంప్ ఫ్లాట్‌గా ఉంది” అంటూ నడుం కింద కూడా ప్యాడ్స్ పెట్టించేవారని వాపోయింది సమీరా.అది కూడా దర్శకత్వ శాఖలో పని చేసే లేడీ అసిస్టెంట్ డైరెక్టర్లే వచ్చి చాలా ఓపెన్‌గా ఈ విషయాలు చెప్పేవారని అసలు విషయం చెప్పుకొచ్చింది.ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా దాదాపు 20 ఏళ్ల పాటు అలా కృత్రిమ బ్రాలు, కాంటాక్ట్ లెన్స్‌లు మోస్తూ బతకాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

మొదటిలో సినిమా తోనే ఎక్స్పీఎరియన్స్

Advertisement

అయితే ఇది తాను నటించిన మొదటిలో సినిమా తోనే ఎక్స్పీఎరియన్స్ చేశానని తొలి చిత్రం ‘మైనే దిల్ తుజ్కో దియా’ సమయంలో తన కలర్ కాస్త నల్లగా ఉందని మేకప్ ని బాగా రుద్ది రుద్ది తెల్లగా మార్చేవారని అలనాటి రోజులని గుర్తు చేసుకుంది.

అంతేకాదు ..తనతో కలిసి నటించే హీరోలు పొట్టిగా ఉంటె వాళ్ళు ఎక్కడ హార్ట్ అవుతారో నాని నన్ను వంగి నడవమనేవారని,అలాగే చేశానని చెప్పుకొచ్చింది.బొద్దుగా ఉంటె చబ్బీగా ఉన్నానని ,సన్నగా అయితే అసలు నీ బాడీనే బాగా లేదని కామెంట్స్ చేసేవారని బాధ పడిపోయింది. అయితే . 20 ఏళ్ల వయసులో ఉండే అమాయకత్వం, కెరీర్ లో ఎదో ఒకటి సాధించాలనే ఆరాటం వల్ల మహిళలు ఇలాంటి వాటికి ఎదురుచెప్పక తలవంచుకుని ఒకే చెప్తారని ఆవేదన వ్యక్తం చేసింది.

తన చెస్ట్ మీద గట్టిగా కొట్టి నవ్వుకుంటూ

ఇక తన స్కూల్ రోజుల్లో బాంద్రాలో స్కూల్ బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే, సైకిల్‌పై వచ్చిన ఒక పోకిరి తన చెస్ట్ మీద గట్టిగా కొట్టి నవ్వుకుంటూ వెళ్లాడని ,అయితే వెంబడించి మరీ వాడిని , సైకిల్ పై నుండి కిందకి తోసి, వాడికి బుద్ధి వచ్చేలా కొట్టానని చిన్న నాటి రోజులని గుర్తు చేసుకుంది.

అయితే పిల్లలకు చిన్నప్పుడే సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సిన అవసరం ఉందని, తాను చిన్నప్పుడు పిచ్చి పుస్తకాలు చదివి తెలుసుకోవాల్సి వచ్చిందని, కానీ తన పిల్లలకు మాత్రం తానే అన్నీ వివరంగా చెప్తానని స్పష్టం చేసింది ఈ బాంబే బ్యూటీ .

ఇండస్ట్రీలో ఇంకెంతకాలం కొనసాగుతుందో !

మొత్తంగా ఈ నరకం నుండి బయటపడటానికి తనకి 40 ఏళ్లు పట్టిందని చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుతం ఈ అమ్మడి సినిమాకి వస్తే దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత ‘ఆఖరి సవాల్’ అనే చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తుంది.చూడాలి మరి ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా సెన్సేషన్ కామెంట్స్ చేసిన ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఇంకెంతకాలం కొనసాగుతుందో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×