// // Samantha Wedding Ring- సమంత వెడ్డింగ్ రింగ్ అర్థం తెలుసా? -->
E-Paper
Advertisement

Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కి అర్థమేంటో తెలుసా.. మాజీ భర్తకు కౌంటరిస్తూ..

Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కి అర్థమేంటో తెలుసా.. మాజీ భర్తకు కౌంటరిస్తూ..
Advertisement

Samantha Wedding Ring Meaning : ఎట్టకేలకు సమంత–రాజ్‌ నిడిమోర్‌ రిలేషన్‌పై స్పెషన్స్‌ వీడింది. పెళ్లి బంధంతో వీరి రిలేషన్‌ని ఆఫిషియల్‌ చేసేశారు. సోమవారం (డిసెంబర్ 1) సమంత–రాజ్ నిడిమోరులు వివాహ బంధంలోకి అడుగుపెట్టరు. కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో సమంత–రాజ్ నిడిమోరులు ఏడడుగులు వేశారు. తాజాగా పెళ్లి ఫోటోలు షేర్‌ చేసి రాజ్ తో బంధాన్ని ఆఫీషియల్‌గా చెప్పేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి సోషల్‌ మీడియా, మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ‌అయితే ఈ ఫోటోల్లో రాజ్ నిడిమోరు తనకి రింగ్ తొడుగుతున్న ఫోటోని షేర్‌ చేసింది. దీంతో అందరి కన్ను సమంత వెడ్డింగ్‌ రింగ్‌ పైనే పడింది.

రాజ్‌ నిడిమోర్ స్పెషల్ గిఫ్ట్

Advertisement

దీర్ఘ చతురస్త్రాకారంలో ఉన్న ఆ రింగ్‌ అందరిలో ఆసక్తి పెంచుతుంది. కొత్త, డిఫరెంట్‌ డిజైన్‌ చేసిన ఈ వెడ్డింగ్‌ రింగ్‌ వెనుక పెద్ద కథే ఉందట. ఈ ఉంగరాన్ని సమంతపై ప్రేమ రాజ్‌ ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. పూర్తిగా డైమండ్‌తో దీర్ఘ చతురస్త్రాకారంలో ఈ ఉంగరాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఈ నాలుగు మూలలకు ఒక్కొదానికి ఒక్కొ అర్థం వచ్చేలా ఉంది. ప్రత్యేకమైన డైమండ్‌, పచ్చ రత్నాలతో డిజైన్‌ చేయించిన ఈ డైమండ్‌ రింగ్‌ వీటికి ఈ నాలుగు అంశాలకు ప్రతీకగా ఉంది. స్పష్టత – నిజాయితీ, నిష్కాపట్యతను సూచిస్తుంది, బలం – స్థితిస్థాపకతపై నిర్మించిన సంబంధం. శాశ్వతమైన బంధం – ధోరణులను. సమయాన్ని భరించే ప్రేమ. ఇది సమంత పట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని రాజ్ నిడిమోరు ఉంగరంతో వెల్లడించాడు.

నీతినిజాయితీతో శాశ్వత బంధం

ప్రేమ, వివాహంలో నిబద్దత, విశ్వాసం, నిజాయితి, బంధంలో విలువైన ప్రేమను సూచిస్తుందట. ఈ వెడ్డింగ్‌ రింగ్‌ సంప్రదాయ పద్దతిలో డైమండ్‌తో తయారు చేశారు. సాలిటైర్‌ హాలో వివాహానికి ప్రతీక స్వచ్ఛమైన ప్రేమ, బంధానికి ప్రతీక. ఈ రింగ్‌లో పొదిగించిన డైమండ్‌.. సమంతతో ఈ బంధాన్ని శాశ్వతంగా నిలబెట్టుకుంటానని, ఎప్పటికీ తన చేయి విడకుండ నిబద్దతో, నిజాయితో తనతో జీవితకాలంగా పాటు తోడు ఉంటానని హామీ ఇస్తుంది. ప్రపంచలోని ప్రేమను, ఆనందాన్ని తనకి ఇస్తున్నాననంటూ ఈ ఉంగరం ద్వారా తన భావాలను వెల్లడిస్తుంది. ఇందులో పొదిగిన పచ్చ రత్నాలు.. చివరిలో వరకు వివాహ బంధంలో స్పష్టమైన నిజాయితీగల శాశ్వత ప్రేమను తెలియచేస్తాయి. మొత్తానికి శాశ్వతమైన ప్రేమ, ఆనందంతో సమంతని తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నదానికి ప్రతీక ఈ డైమండ్‌ రింగ్‌ని రాజ్‌ నిడిమోరు డిజైన్‌ చేయించినట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read: Samantha-Raj Nidimoru: సమంతతో పెళ్లి.. ఇంతకి రాజ్‌నిడిమోర్‌ భార్యకి విడాకులిచ్చాడా?

సమంతపై ప్రేమ, గౌరవానికి నిదర్శనంగా..

అయితే ఇక్కడ ఒక బంధం పట్ల నీతి, నిజాయితీగా ఉండాలని, బలమైన ప్రేమను శాశ్వతంగా నిలుపుకుంటాననని అర్థం వచ్చేలా డిజైన చేయించారు. ఈ రింగ్‌ అర్థం చూసి అంత ఇది సమంత మాజీ భర్త నాగచైతన్యకు కౌంటర్‌లా ఉందని సందేహిస్తున్నారు. నిజానికి సమంత నాగచైతన్యలది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. పదేళ్లు ప్రేమించుకున్న వీరి 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వైవాహిక బంధంలో కలతలు రావడంతో 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత శోభిత ధూళిపాళ తో రిలేషన్‌ ఉన్న చై గతేడాది ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సమంతను నాగచైతన్య చీట్‌ చేశాడని సమంత ఫ్యాన్స్‌ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు సమంత వెడ్డింగ్‌ ఉన్న అర్థం తెలిసి.. ఇది తన మాజీ భర్తకు కౌంటరని, ఒకసారి ప్రేమలో, వైవాహిక బంధంలో మోసపోయిన సమంత.. తనకు నమ్మకం, విలువైన ప్రేమ అందించే వ్యక్తిని తన లైఫ్‌కి ఆహ్వానిచ్చిందని పలువురు నెటిజన్స్‌ యాంటీ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×