E-Paper
Advertisement

Samantha: అది తప్ప.. అన్నీ వచ్చు…. పాపం రాజ్.. పర్సనల్ విషయాలు బయటపెట్టిన సమంత..!

Samantha: అది తప్ప.. అన్నీ వచ్చు…. పాపం రాజ్.. పర్సనల్ విషయాలు బయటపెట్టిన సమంత..!
Advertisement

Samantha Ugadi Interview:మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్లలో హీరోయిన్ సమంత మరియు దర్శకురాలు నందిని రెడ్డి చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా వీరిద్దరూ ప్రముఖ యాంకర్ సుమతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో జరిగిన సరదా సంఘటనలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ఉగాది పచ్చడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు సుమ సరదాగా “మీకు వంట వచ్చా?” అని అడిగింది. దీనికి సమంత నవ్వుతూ “నాకు వంట తప్ప అన్ని పనులు వచ్చు” అని చెప్పింది. ఆమె చెప్పిన ఈ మాటకు అందరూ నవ్వుకున్నారు.

Advertisement

ఆ తర్వాత సుమ, ఉగాది పచ్చడి ఎలా చేయాలో సమంతకు సరదాగా నేర్పించింది. పక్కనే నందిని రెడ్డి కూడా ఉండి ఈ సన్నివేశాన్ని ఆసక్తిగా చూస్తూ నవ్వుతూ పాల్గొన్నారు. ఈ సమయంలో కార్యక్రమం మొత్తం హాస్యంగా మారింది.

Advertisement

ఇక తర్వాత నందిని రెడ్డి, సినిమా డైలాగ్‌ను గుర్తు చేస్తూ “కోపం తెప్పించొద్దు.. కోపం తెప్పిస్తే గన్ను పట్టుకుంటుంది” అని చెప్పింది. ఇది మా ఇంటి బంగారం సినిమాలోని డైలాగ్ అని చెప్పడంతో అందరూ మరింత ఆసక్తిగా విన్నారు.

తర్వాత సుమ, సమంతను “మీకు ఫైట్ సీన్స్ సిస్టమా?” అని అడిగింది. దీనికి సమంత “అవును” అని సమాధానం ఇచ్చింది. అప్పుడు నందిని రెడ్డి సరదాగా “పాపం రాజ్” అని అనడంతో అక్కడ నవ్వులు పూశాయి.

దానికి సమంత వెంటనే “నేను రాజ్‌తో ఎలాంటి ఫైట్ చేయను” అని చెప్పింది. ఆమె చెప్పిన ఈ మాటలు చాలా సరదాగా అనిపించాయి. అయితే సుమ వెంటనే స్పందిస్తూ, “రాజ్‌కి కూడా ఫైట్ సీన్స్ అలవాటు ఉంది కదా, మీరు చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లో కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయి” అని చెప్పింది.

మొత్తం పైన.. ఈ ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్‌లో సమంత, నందిని రెడ్డి, సుమ ముగ్గురి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మా ఇంటి బంగారం సినిమా పై కూడా ఈ ప్రమోషన్స్ వల్ల మరింత ఆసక్తి పెరుగుతోంది.

ALSO READ: Samantha: ఉగాది స్పెషల్.. సమంత మా ఇంటి బంగారం టీమ్ తో ప్రత్యేక వీడియో!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×