E-Paper
Advertisement

సమంత దంపతులకు చిరంజీవి స్పెషల్ విష్.. ఆ ఒక్క మాటతో గుడ్ న్యూస్ లీక్!

సమంత దంపతులకు చిరంజీవి స్పెషల్ విష్.. ఆ ఒక్క మాటతో గుడ్ న్యూస్ లీక్!
Advertisement

Samantha Pregnancy Buzz: టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం.. ‘చిరు లీక్స్’ హిట్‌ లిస్ట్‌లో మరో క్రేజీ న్యూస్‌ చేరిపోయింది. సోషల్‌ మీడియా వేదికగా మెగాస్టార్‌ చిరంజీవి చేసే పోస్టులు, ఇచ్చే అప్‌డేట్లు ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా, ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. స్టార్‌ బ్యూటీ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (రాజ్ & డికె) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సాధించిన ఘన విజయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కానీ, ఆ అభినందనల వెనుక చిరు వదిలిన ఒక ‘లీక్’ ఇప్పుడు నెట్టింట తుఫాన్ లేపుతోంది.

Read also-‘నాగబంధం’ నుంచి పవర్‌ఫుల్ సాంగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

ఆ ఒక్క లైన్.. నెట్టింట హాట్ టాపిక్!

Advertisement

చిరంజీవి తన పోస్ట్‌లో ‘మా ఇంటి బంగారం’ గ్రాండ్ సక్సెస్‌ను కొనియాడుతూనే, ఎవరూ ఊహించని ఒక సర్‌ప్రైజింగ్ లైన్‌ను యాడ్ చేశారు. “అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత & రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు” అంటూ మెగాస్టార్ ట్వీట్ చేయడం విశేషం. ఈ ఒక్క మాటతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. సాధారణంగా సినిమా విశేషాలను లేదా వ్యక్తిగత విషయాలను చిరంజీవి ముందే లీక్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. దీన్నే ఫ్యాన్స్ ‘చిరు లీక్స్’ అని పిలుచుకుంటారు. ఇప్పుడు సమంత జీవితంలో తల్లిగా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోందనే విషయాన్ని, ఆమె ప్రెగ్నెన్సీ వార్తలను చిరంజీవి అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేశారంటూ నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు.

Read also-Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి దిమ్మతిరిగే షాక్.. నర్మద దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వేదవతి మాటతో మైండ్ బ్లాక్..

డబుల్ ధమాకాలో సమంత..

Advertisement

సమంత ప్రెగ్నెన్సీ గురించిన వార్తలు గత కొంతకాలంగా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గుసగుసలుగా వినిపిస్తున్నప్పటికీ, ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, స్వయంగా ఇండస్ట్రీ పెద్ద దిక్కు అయిన చిరంజీవి ‘కొత్త అధ్యాయం’, ‘దంపతులు’ అంటూ విష్ చేయడంతో ఈ వార్తలకు బలమైన ముద్ర పడినట్లయింది. ఒకవైపు ‘మా ఇంటి బంగారం’ సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవడం, మరోవైపు వ్యక్తిగత జీవితంలో మాతృత్వపు మధురిమలను ఆస్వాదించడానికి సిద్ధమవ్వడం.. ఇలా సమంత ఒకేసారి డబుల్ గుడ్ న్యూస్‌లతో ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం చిరు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ మెగా లీక్‌పై సమంత లేదా రాజ్ నిడిమోరుల టీమ్ ఎలా స్పందిస్తుందోనని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×