E-Paper
Advertisement

‘మా ఇంటి బంగారం’ నుండి వచ్చేసిన ఫస్ట్ సింగిల్ .. తస్సాదియ్యా అంటున్న సామ్

‘మా ఇంటి బంగారం’ నుండి వచ్చేసిన ఫస్ట్ సింగిల్ .. తస్సాదియ్యా అంటున్న సామ్
Advertisement

Samantha Comeback :చాలా ఏళ్ళపాటు టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసి కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు మరోసారి మాయ చేస్తానంటూ రెడీ అయిపొయింది. యస్.. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సాలిడ్ గా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మొదలెట్టేందుకు రెడీ అయిపొయింది. అప్పుడెప్పుడో మూడేళ్ళ కింద ఖుషీలో కనబడ్డ సామ్ మళ్ళీ మెయిన్ లీడ్ గా తెలుగులో ఈ సినిమాతోనే ఎంట్రీ ఇస్తుండటం ఒక విశేషం అయితే తన సొంత బ్యానర్ ‘ట్రాలాల పిక్చర్స్’ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం ఇక్కడ మరో విశేషం.

‘తస్సాదియ్యా’ అంటూ ఫస్ట్ సింగిల్

Advertisement

ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి ‘తస్సాదియ్యా’ అంటూ ఫస్ట్ సింగిల్ ని వదిలింది మూవీ టీమ్. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ తనదైన స్టైల్లో ఇచ్చిన ఎంటర్‌టైనింగ్ ట్యూన్ కి పోనీ వర్మ తనదైన స్టైల్ లో క్రేజీగా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాటని రెహమాన్ రాయగా చిన్మయి, పుణ్య సెల్వలు తమ స్టైల్ లో పాడి మెప్పించారు. ఇక విడుదలైన ఈ పాటలో సామ్ మేకోవర్‌, ట్రెడిషనల్ గా కనిపించిన తీరుకి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ సినిమా ఆడియో రైట్స్ ని థింక్ మ్యూజిక్ ఇండియా సంస్థ దక్కించుకున్న సంగతి తెల్సిందే.

ఫ్యామిలీ  కలిసి ఎంజాయ్ చేసే విధంగా

Advertisement

సాంప్రదాయ చీరకట్టులో సమంత మెరిసిపోతూ, ఒక మధ్యతరగతి పెళ్లి వాతావరణం, కుటుంబ సభ్యుల సందడి మధ్య సామ్ చేసిన డ్యాన్స్ ఈ సాంగ్‌కు మెయిన్ హైలైట్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఉన్న ఈ పాట, సినిమా మూడ్‌ను క్లియర్ గా సెట్ చేసిందనే చెప్పాలి. అయితే ఈ పాటలో బుల్లితెర సుందరి శ్రీముఖి కూడా మెరవడం విశేషం.

రెండు డిఫరెంట్ షేడ్స్ లో 

ఇక గతంలో ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాని  యాక్షన్-కామెడీ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తుందని టాక్. సామ్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ గా, మరోవైపు రహస్యంగా దేశం కోసం పనిచేసే ఒక పవర్‌ఫుల్ అండర్‌కవర్ ఏజెంట్‌గా రెండు డిఫరెంట్ షేడ్స్ లో  ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు గ్లిమ్ప్స్ చూస్తేనే అర్థమవుతుంది.

కథ అందించిన రాజ్ నిడిమోరు

ఇక ఈ సినిమాకి సమంత భర్త రాజ్ నిడిమోరు కథని అందించడం విశేషం.  సమంత పట్టుదల చూస్తుంటే, ఈ వేసవికి బాక్సాఫీస్ వద్ద తన పాత రికార్డులను తానే తిరగరాసేలా కనిపిస్తోంది. చూడాలి మరి చైతుతో డివోర్స్ చేసుకుని రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడికి మే 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×