// // Maa Inti Bangaram Collection: బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. -->
E-Paper
Advertisement

బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. 3 రోజుల్లో ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్ ఎంతంటే?

బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. 3 రోజుల్లో ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్ ఎంతంటే?
Advertisement

Maa Inti Bangaram Collection: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, మొదటి వీకెండ్ (మూడు రోజులు) ముగిసేసరికి దేశవ్యాప్తంగా రూ. 14.42 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ ట్రాకర్ ‘శాక్నిల్క్’ ప్రకారం, గ్రాస్ వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 16.75 కోట్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద నిలకడైన ప్రదర్శనను కనబరుస్తోంది. విడుదలైన మొదటి రోజు రూ. 5.35 కోట్లు రాబట్టగా, శనివారం నాటి రెండో రోజున భారీ వృద్ధితో రూ. 7.50 కోట్లు సాధించింది. ఇక మూడో రోజైన ఆదివారం నాడు కాస్త నిలకడగా సాగుతూ రూ. 1.57 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది.

Read also-Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Advertisement

భాషల వారీగా చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఆదరణ లభిస్తోంది. మూడో రోజున తెలుగు వెర్షన్ 695 షోల ద్వారా దాదాపు రూ. 1.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించగా, తమిళ వెర్షన్ 179 షోల ద్వారా రూ. 7 లక్షల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆదివారం నాడు ఈ సినిమా థియేటర్లలో సగటున 39.9% అక్యూపెన్సీని నమోదు చేయగా, ముఖ్యంగా మార్నింగ్ షోలకు అత్యధికంగా 45.92% అక్యూపెన్సీ లభించింది.

Read also-‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. యష్ ప్యాన్స్‌కు పండగే..

Advertisement

ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళ, తన గతానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని దాచిపెట్టి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సమంత నటనపై ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది; ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌తో పాటు, యాక్షన్ బ్లాక్స్‌లో ఆమె చూపించిన పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలె, గౌతమి, శ్రీముఖి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయగా, ఫస్ట్ వీకెండ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం వీక్‌డేస్‌లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×