// // Samantha-Raj Nidimoru Assets- రాజ్‌ ఆస్తులు ఎంతో తెలుసా? -->
E-Paper
Advertisement

Samantha-Raj Nidimoru Assets: రాజ్‌ నిడిమోరు ఆస్తులు ఎంతో తెలుసా? ఇద్దరిలో సమంతకే ఎక్కువ!

Samantha-Raj Nidimoru Assets: రాజ్‌ నిడిమోరు ఆస్తులు ఎంతో తెలుసా? ఇద్దరిలో సమంతకే ఎక్కువ!
Advertisement

Samantha and Raj Nidimoru Net Worth: హీరోయిన్‌ సమంత–రాజ్‌ నిడిమోరు పెళ్లి ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారింది. కొంతకాలంగా రిలేషన్‌ ఉన్న వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌ స్థాపకుడు సద్గురు ఆశీర్వాదంతో సోమవారం వీరిద్దరు ఒక్కటయ్యారు. ఈషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో డిసెంబర్‌ 1, 2025న వీరి పెళ్లి జరిగింది. వివాహ అనంతరం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌ చేసి అధికారికంగా ప్రకటించింది.

పెళ్లి బంధంతో ఒక్కటి

Advertisement

దీంతో వీరి బంధం ఇప్పుడు ఆఫీషియల్‌ అయిపోయింది. నిన్నటి ప్రేమికులు ఉన్న రాజ్‌-సామ్‌ (Rajsam) భార్యభర్తలు అయిపోయారు. దీంతో ఈ జంటకు శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సమంతతో పెళ్లి తర్వాత రాజ్‌ నిడిమోరు మరింత హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఆయన వ్యక్తిగత విషయాలు, బ్యాగ్రౌండ్‌, ఆస్తులు వ్యక్తిగత సమాచారంపై నెటిజన్స్‌ కన్నేశారు. ముఖ్యంగా రాజ్ నిడిమోరు ఆస్తులు వివరాలపై తెగా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో రాజ్‌ ఆస్తులు, బ్యాగ్రౌండ్ విషయాలు ట్రెండ్‌ అవుతున్నాయి. రాజ్‌ నిడిమోరు దర్శకుడు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో ఆయన ఒకరు. తన స్నేహితుడు డీకేతో కలిసి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. రాజ్ అండ్‌ డీకే దర్శక ద్వయంలో ఒకరే రాజ్‌ నిడిమోరు. ఈయన మన తెలుగు వ్యక్తే.

మన తెలుగు వ్యక్తే రాజ్

తిరుపతి పుట్టిన ఆయన కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ చదివారు. ఆ తర్వాత అమెనికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్ చేసిన ఆయనకు డీకే పరిచయం అయ్యాడు. దీంతో వీరిద్దరు కలిసి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. వీరి దర్శకత్వంలో మొదట షాదీ.కామ్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందింది. ఆ తర్వాత 2003లో రాజ్ అండ్ డీకే కలిసి ‘ఫ్లేవర్స్’ అనే ఇంగ్లీష్‌ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత 2009లో 99 అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వీళ్లు వరుసగా వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తూ పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ అనే హిందీ సినిమాలకు దర్శకుడు, రచయితగా వ్యవహరించాడు. తెలుగులో 2013లో వచ్చిన డీ ఫర్ దోపిడీ మూవీకి నిర్మాత రాజ్ నిడిమోరు. 

Advertisement

Also Read: Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కి అర్థమేంటో తెలుసా.. మాజీ భర్తకు కౌంటరిస్తూ..

ది ఫ్యామిలీ మ్యాన్ తో పాపులర్

ది ఫ్యామిలీ మ్యాన్‌ తో రాజ్ అండ్‌ డీకేలకు విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఆ తర్వా త రాజ్ నిడిమోరు గురించి తెలిసిందే. ఇలా దర్శకుడిగా, నిర్మాత, రచయిత రాజ్‌ నిడిమోరు బాగానే సంపాదిస్తున్నారు. ఓటీటీల తర్వాత భారీగా పారితోషికం తీసుకుంటూ బాగానే ఆస్తులు కూడపెట్టాడట. మీడియా అంచనాల ప్రకారం.. రాజ్ నిడిమోరు ప్రస్తుత నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 83 కోట్ల నుంచి రూ. 85 కోట్లు వరకు ఉంటుందట. డైరెక్టర్‌, రైటర్, ప్రొడ్యూసర్‌గా కోట్లలో పారితోషికంతో పాటు ప్రపంచ OTT సహకారాల నుంచి కూడా లాభాలు తీసుకుంటాని టాక్‌. అలా ఒక్క వెబ్‌ సిరీస్‌ కి పారితోషికంతో పాటు లాభాల్లో షేర్‌ కలిపి రూ. 30 నుంచి రూ. 50 కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం.

ఇద్దరి ఆస్తులు ఎంతంటే

అలాగే సమంత కూడా నటిగా బాగానే సంపాదిస్తుంది. హీరోయిన్‌గా కోట్లలో రెమ్యునరేషన్‌ తీసుకోవడమే కాదు ఆమె వస్త్రా వ్యాపారంలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పెళ్లి తర్వాత సమంత సాఖి పేరుతో బ్రాండెండ్‌ డిజైనర్‌ స్టూడియోని ప్రారంభించింది. మరోవైపు వివిధ వాణిజ్య ప్రకటనలు, ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్స్‌, ప్రకటనల ద్వారా సమంత రెండు చేతుల సంపాదిస్తుంది. ఇటీవల ట్రాలాలా పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్ స్థాపించి నిర్మాతగానూ మారింది. నటిగా, నిర్మాత, బిజినెస్‌ ఉమెన్‌గా సమంత బాగానే ఆస్తులు వెనకేసుకుందట. ప్రముఖ బాలీవుడ్‌ మీడియా సంస్థ ప్రకారం.. సమంత నికర ఆస్తుల విలువ సుమారు రూ. 100 నుంచి రూ. 110 కోట్ల వరకు ఉంటుందని అంచన. ఇలా ఇద్దరి ఆస్తులు కలిపి రూ. 190 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

Also Read: Samantha-Raj Nidimoru: సమంతతో పెళ్లి.. ఇంతకి రాజ్‌నిడిమోర్‌ భార్యకి విడాకులిచ్చాడా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×