E-Paper
Advertisement

Sai Pallavi: ఫ్లాప్ హీరో కోసం ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..!

Sai Pallavi: ఫ్లాప్ హీరో కోసం ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..!
Advertisement

Sai Pallavi: సాయి పల్లవి, ప్రభాస్ సినిమాని రిజెక్ట్ చేసింది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ధనుష్ 55వ సినిమా, తాత్కాలికంగా డీ55 (D55) అనే టైటిల్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్టు కోసమే ప్రభాస్ సినిమాని సాయి పల్లవి రిజెక్ట్ చేస్తున్నట్టు వినికిడి. ఇంతకుముందు సాయి పల్లవి, ధనుష్ తో చేసిన మారి సినిమా పెద్ద విజయం సాధించలేదు. అంతేకాదు ఈమధ్య వచ్చిన ధనుష్ చిత్రాలకు కూడా ఫ్లాప్ గానే మిగిలాయి.

ఈ క్రమంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అమరన్ తర్వాత హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడు ధనుష్తో సినిమా ఒప్పుకొని ప్రభాస్ సినిమాని మాత్రం పక్కన పెట్టినట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ధనుష్ సినిమాని కూడా అమరన్ దర్శకుడు.. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించడం గమనర్హం. ఈ సినిమాలో హీరోగా ధనుష్ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన వెంటనే ఆన్‌లైన్‌లో భారీ బజ్ మొదలైంది. మొదటి నుంచే ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి ఉంటుందని ప్రచారం జరిగింది.

Advertisement

అయితే.. మధ్యలో ఈ సినిమాలో శ్రీలీల కూడా భాగమవుతున్నట్లు వార్తలు రావడంతో, సాయి పల్లవి స్థానంలో ఆమె వచ్చిందని కొంతమంది భావించారు. దీంతో సోషల్ మీడియాలో గందరగోళం ఏర్పడింది. కానీ చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో మరో వార్త కూడా వైరల్ అయింది. కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో అవకాశం వచ్చినా, సాయి పల్లవి ఆ సినిమాను తిరస్కరించిందని కథనాలు వచ్చాయి. ఆ సినిమా హీరో ప్రభాస్ కావడంతో, “ప్రభాస్ సినిమాను వదిలేసి ధనుష్ సినిమాకు ఓకే చెప్పిందా?” అనే చర్చ మొదలైంది.

Advertisement

ఈ నిర్ణయానికి కారణంగా, సాయి పల్లవి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అయిన రామాయణంలో బిజీగా ఉండటమేనని సమాచారం. డేట్స్ సమస్య వల్లే ఆమె ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, ధనుష్‌తో సినిమా చేయాలనే ఆసక్తితో డీ55కి ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ముందుగా చెప్పినట్లు ధనుష్ – సాయి పల్లవి జంట కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. వీరిద్దరూ గతంలో మారి 2 సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా..అందులోని రౌడీ బేబీ పాట మాత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది.

ఇప్పుడు డీ55 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సాయి పల్లవి కోలీవుడ్ కెరీర్‌ను మరింత బలపరుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం ప్రేక్షకులే ఇవ్వాలి. అభిమానులు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: Dhurandhar 2: డ్రోన్ ఎఫెక్ట్.. చిక్కుల్లో ‘ధురందర్ 2’ చిత్ర బృందం.. అసలు విషయమిదే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×