E-Paper
Advertisement

Rakshit Shetty: రష్మిక మాజీ ప్రియుడి గురించి కీలక విషయాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్.. అర్థరాత్రి 2 గంటలకు గొడవ అంటూ..!

Rakshit Shetty: రష్మిక మాజీ ప్రియుడి గురించి కీలక విషయాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్.. అర్థరాత్రి 2 గంటలకు గొడవ అంటూ..!
Advertisement

Rakshit Shetty: పాన్ ఇండియా పరంగా సూపర్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రష్మిక. రష్మిక త్వరలోనే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోబోతోంది అన్న విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అయితే విజయ్ దేవరకొండ కన్నా కూడా ముందు రష్మిక.. రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అతనితో నిశ్చితార్థం అయ్యాక.. వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది.

అతని గురించి ఆమె..!

ప్రస్తుతం రష్మిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉండగా.. అలానే విజయ్ దేవరకొండ అని పెళ్లి చేసుకుంటూ ఉండగా.. ఆమె అభిమానులు రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి.. గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అప్పుడప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

Advertisement

ఈ క్రమంలో ఈ మధ్యనే తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన రుక్మిణ వసంత్.. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి..తాజాగా అదే సినిమా హీరో రక్షిత్ శెట్టి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.

సప్తసాగరాలు దాటి సినిమా రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. ఇందులో రుక్మిణి వసంత్, రక్షిత్ శెట్టి మధ్య కనిపించిన కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తర్వాత రుక్మిణికి వరుస అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా కాంతార 2 వంటి పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు కీలకంగా మారింది.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రుక్మిణి వసంత్, రక్షిత్ శెట్టి వ్యక్తిత్వం గురించి మాట్లాడింది. “రక్షిత్ చాలా డిఫరెంట్ పర్సన్. ఆయన సినిమాలను కేవలం డబ్బు లేదా మార్కెట్ కోసమే చూడరు. ప్రతి కథను ఒక ప్రత్యేక దృష్టితో చూస్తారు. అందుకే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి” అని ఆమె చెప్పింది.

అర్థరాత్రి రెండు గంటలకు గొడవ..!

అలాగే షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను కూడా ఆమె గుర్తు చేసుకుంది. సప్తసాగరాలు దాటి షూటింగ్ జరుగుతున్న సమయంలో అర్ధరాత్రి 2 గంటలకు ఒక అభిమాని ఫోటో కోసం గొడవ చేశాడట. షూటింగ్‌లో కాస్ట్యూమ్స్ లీక్ కాకూడదనే కఠినమైన నియమాలు ఉంటాయి. అయినా కూడా రక్షిత్ శెట్టి ఆ అభిమానితో చాలా ప్రశాంతంగా మాట్లాడారని రుక్మిణి తెలిపింది. దాదాపు అరగంట పాటు అతనికి పరిస్థితిని వివరించి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించారట.

“ఆ సమయంలో ఆయన ఎంత కూల్‌గా వ్యవహరించారో చూసి నేను ఆశ్చర్యపోయాను. రక్షిత్ శెట్టి కేవలం మంచి నటుడే కాదు, చాలా మంచి మనసున్న వ్యక్తి కూడా” అంటూ రుక్మిణి ప్రశంసలు కురిపించింది.

ఇక ప్రస్తుతం రుక్మిణి వసంత్, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో ఆమె మరింత పెద్ద స్టార్‌గా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.

ALSO READ: O Romeo OTT : షాహిద్ కపూర్ – త్రిప్టీ దిమ్రీ మూవీకి కోర్టులో ఊరట… థియేట్రికల్ రన్ తరువాత ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×