E-Paper
Advertisement

రౌడీ జనార్ధన స్పెషల్ పోస్టర్.. “ప్రపంచంతో పోరాడే యోధుడు ప్రేమకు లొంగిపోతాడు”!

రౌడీ జనార్ధన స్పెషల్ పోస్టర్.. “ప్రపంచంతో పోరాడే యోధుడు ప్రేమకు లొంగిపోతాడు”!
Advertisement

Rowdy Janardana:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుండి స్పెషల్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ మూవీ నుండి ఆకట్టుకునే స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ప్రేమికుల హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. పైగా ఈ పోస్టర్ కి క్యాప్షన్ గా “ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు” అంటూ షేర్ చేసిన క్యాప్షన్ మరింత ఆకట్టుకుంటుంది.

రౌడీ జనార్ధన్ నుండి స్పెషల్ పోస్టర్..

ఇకపోతే విజయ్ దేవరకొండకు రౌడీ జనార్ధన్ మూవీ స్పెషల్ విషెస్ తెలియజేస్తూ పంచుకున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. వర్షంలో తడుస్తూ చేతిలో గన్ను పట్టుకొని కూర్చొని.. ప్రేమగా చూస్తుండగా ఆయన గుండెలపై కీర్తి సురేష్ కాలు మోపిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆమె ముఖాన్ని రివీల్ చేయకుండా కేవలం విజయ్ దేవరకొండ గుండెలపై కీర్తి సురేష్ కాలుమోపిన దృశ్యాన్ని మాత్రమే చిత్ర బృందం షేర్ చేస్తూ ఈ విధంగా విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. మొత్తానికి అయితే ఈ లవ్లీ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది అని చెప్పవచ్చు.

రౌడీ జనార్ధన్ సినిమా విశేషాలు..

Advertisement

రవి కిరణ్ కోలా దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే వాస్తవిక గ్రామీణ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేయగా.. అందులో హై వోల్టేజ్ డ్రామా పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు రివీల్ చేశారు. ఊర మాస్ లుక్కులో.. కండలు తిరిగిన దేహంతో.. ఒంటినిండా రక్తపు మరకులు.. చేతిలో కత్తితో చాలా రౌద్రంగా కనిపించిన విజయ్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ ఒక్క గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన పోస్టర్ లవర్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఈ చిత్రం తెలుగుతోపాటు కన్నడ , తమిళ్, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా గా విడుదల కాబోతోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ రౌడీ జనార్ధన సినిమా విజయ్ కి ఊహించని విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

also read:HBD Vijay Deverakonda: రౌడీ హీరో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? మరి ఇష్టమైన కార్లు?

భార్య రష్మికతో హ్యాట్రిక్ కి సిద్ధమైన విజయ్ దేవరకొండ..

Advertisement

విజయ్ దేవరకొండ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఒకవైపు రౌడీ జనార్ధన చిత్రంతో పాటు మరొకవైపు రణబాలి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఈయన భార్య ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. పైగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కూడా కావడం విశేషం..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×