E-Paper
Advertisement

సైన్స్ ఫిక్షన్‌తో సుమ కొడుకు కొత్త ప్రయోగం.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా?

సైన్స్ ఫిక్షన్‌తో సుమ కొడుకు కొత్త ప్రయోగం.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా?
Advertisement

Roshan Kanakala: ‘బబుల్‌గమ్అనే సినిమాతో టాలీవుడ్ లోకి  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమ కొడుకు రోషన్ కనకాల .సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ముఖ్యంగా సుమ కనకాల, రాజీవ్ కనకాల వారసుడిగా ఇండస్ట్రీలోకి భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చినప్పటికీ సినిమా డిసప్పాయింట్ చేయడంతో ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని  మోగ్లి అంటూ మరో సినిమా చేశాడు రోషన్ కనకాల.కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో ఈసారి మరింత గ్యాప్ తీసుకున్నాడు రోషన్ .

కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న విఐ ఆనంద్

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా ప్రయోగాత్మక సినిమాల దర్శకుడైన విఐ ఆనంద్ తో చేతులు కలిపాడు .ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘డిస్కో రాజా’, ‘ఊరు పేరు భైరవకోన వంటి వెరైటీ ఫిలిమ్స్ తో టాలీవుడ్ లో తనదైన స్టాంప్ వేసిన విఐ ఆనంద్ ఈ సరికొత్త సినిమాకి కథ స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం.ఇక ఆయనే ఈ సినిమాకి ప్రెజెంట్ చేయడం ఇక్కడ మరో విశేషం .విజయ్ కె. కమిశెట్టి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు .సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కి క్లీన్ రొమాంటిక్ కామెడీని జోడించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

also read :సోగ్గాడు రియల్ లైఫ్ సీక్రెట్స్:భార్య శాంతకుమారి మరణంతో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విశేషాలు!

Advertisement

అయితే వరుస రెండు సినిమాల డిజాస్టర్ ల తర్వాత ఈ సైన్స్ ఫిక్షన్ కథ రోషన్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుందనేది చూడాలి.ఇక తాజాగా హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్న ఈ సినిమా వేడుకకి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయి క్లాప్ కొట్టాడు ఈ సినిమాలో.రోషన్ సరసన గహాజీ హీరోయిన్‌గా నటిస్తోంది.

కథ డిమాండ్ మేరకు భారీ విజువల్ ఎఫెక్ట్స్

కార్తికేయ 2 సినిమాతో ఫ్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిఖిల్ విఐ ఆనంద్ తో ఉన్న పాత పరిచయంతో ఈవెంట్ కు హాజరయ్యాడని తెలుస్తుంది.అలాగే మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి విజువల్ వండర్స్ కి వర్క్ చేసిన టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమా యూనిట్ ని  బ్లెస్ చేశారు.అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్.భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో కథ డిమాండ్ మేరకు భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కూడా ఉండనున్నాయని  సమాచారం.

కమర్షియల్ సక్సెస్ ని అందిస్తుందో లేదో!

ఇక నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలని వాటితోపాటు ఫస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.పైగా ఈ నెల చివరి నుంచే ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్రామ్‌కామ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తుంది .చూడాలి మరి వరుసగా రెండు అట్టర్ ప్లాప్స్ ను మూట కట్టుకున్న రోషన్ కనగాల కి ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అయినా కమర్షియల్ సక్సెస్ ని అందిస్తుందో లేదో!

also read :నందమూరి మోక్షజ్ఞ విత్ సందీప్ వంగ …ఇది అయ్యేదేనా ?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×