E-Paper
Advertisement

Mowgli Trailer: ప్రేమ కోసం యుద్ధం చేసే ప్రతి ఒక్కడు హీరోనే… ఇంట్రెస్టింగ్ గా మోగ్లీ ట్రైలర్!

Mowgli Trailer: ప్రేమ కోసం యుద్ధం చేసే ప్రతి ఒక్కడు హీరోనే… ఇంట్రెస్టింగ్ గా మోగ్లీ ట్రైలర్!
Advertisement

Mowgli Trailer: కలర్ ఫోటో సినిమా ద్వారా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వంలో యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల (Roshan Kanakala)హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ(Mowgli). ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు . ప్రముఖ సినీనటి రష్మిక మందన్న(Rashmika Mandanna) చేతులమీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూస్తుంటే మాత్రం సినిమాలో లవ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయని, ఈ సినిమా ద్వారా రోషన్ కచ్చితంగా హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సినిమాలో రోషన్ కి జోడిగా సాక్షి  మడోల్కర్ (Sakshi Madolkar.)హీరోయిన్ గా నటిస్తున్నారు.

విలన్ పాత్రలో బండి సరోజ్..

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే మాత్రం హీరోయిన్ మూగమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక రోషన్ సైతం సినిమాలలో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసే కుర్రాడిగా ఇందులో కనిపించారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బండి సరోజ్ కనిపించబోతున్నారు. పోలీస్ ఆఫీసర్ గా ఈయన నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమాతో రోషన్ కచ్చితంగా హిట్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా భావిస్తున్నారు.

ట్రైలర్ లాంచ్ చేసిన రష్మిక..

Advertisement

సుమ కనకాల కుమారుడి కోసం స్టార్స్ అందరూ కూడా రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్ కోసం నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ ఇవ్వగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశారు. తాజాగా ట్రైలర్ కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న రంగంలోకి దిగటం విశేషం. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమ కథగా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోయే ఈ సినిమా ద్వారా రోషన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Advertisement

ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన పాటలు టీజర్ వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదివరకే బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోషన్ మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా, తన నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి.. ఇక రెండో సినిమాతో మాత్రం హిట్ కొట్టాలనే కసితో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సందీప్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి. బండి సరోజ్ విలన్ పాత్ర కూడా అంచనాలను పెంచేస్తున్నాయి.

Also Read: Ranveer Singh: ముదురుతున్న వివాదం.. రణవీర్ సింగ్ పై హిందు జన జాగృతి సమితి ఫిర్యాదు!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×