E-Paper
Advertisement

Roger Allers Death: ది లయన్ కింగ్ సినిమా దర్శకుడు మృతి..!

Roger Allers Death: ది లయన్ కింగ్ సినిమా దర్శకుడు మృతి..!
Advertisement

Roger Allers Death: హాలీవుడ్ యానిమేషన్ సినిమా రంగానికి తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ యానిమేషన్ దర్శకుడు రోజర్ అలర్స్ 76 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొద్ది రోజుల అనారోగ్యంతో అమెరికాలోని శాంటా మోనికాలో తన నివాసంలో ఆయన మరణించినట్లు డిస్నీ యానిమేషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ వార్త తెలిసిన వెంటనే హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

రోజర్ అలర్స్ పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది ది లయన్ కింగ్ సినిమా. 1994లో విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ఆయన సహ దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమా పిల్లలనే కాదు, పెద్దలను కూడా ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. కథ, సంగీతం, పాత్రలు అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఓ అద్భుతంగా మార్చాయి. విడుదల సమయంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి.. ఆ సంవత్సరంలో అత్యధిక ఆదాయం పొందిన చిత్రంగా నిలిచింది.

Advertisement

‘ది లయన్ కింగ్’ విజయం తర్వాత ఈ కథ ఆధారంగా బ్రాడ్‌వేలో మ్యూజికల్ రూపొందించారు. ఆ మ్యూజికల్ స్క్రీన్‌ప్లేపై కూడా రోజర్ అలర్స్ పనిచేశారు. దీనివల్ల ఆయనకు టోనీ అవార్డు నామినేషన్ కూడా వచ్చింది. ఇదే కాదు, 2019లో వచ్చిన లైవ్ యాక్షన్ రీమేక్ కూడా భారీ వసూళ్లు సాధించి మరోసారి ఈ కథ గొప్పతనాన్ని నిరూపించింది.

ఈ సినిమా కంటే ముందే రోజర్ అలర్స్ డిస్నీ యానిమేషన్‌లో కీలక పాత్ర పోషించారు. బ్యూటీ అండ్ ది బీస్ట్, అలాడిన్, ది లిటిల్ మెర్మెయిడ్ వంటి ప్రముఖ చిత్రాల తయారీలో ఆయన సృజనాత్మకంగా పనిచేశారు. డిస్నీ యానిమేషన్‌కు స్వర్ణయుగంగా చెప్పుకునే కాలంలో ఆయన ఒక బలమైన ఆధారంలా నిలిచారు.

Advertisement

డిస్నీ సీఈవో బాబ్ ఐగర్.. కూడా రోజర్ అలర్స్ మృతిపై సంతాపం తెలిపారు. గొప్ప కథ చెప్పే శక్తి ఆయనకు ఉందని, ఆయన సృష్టించిన పాత్రలు తరతరాల ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయని అన్నారు.

ALSO READ: Jana Nayagan Release: విజయ్ సినిమాకి మిగిలి ఉండే మూడు దారిలో ఇవే..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×