E-Paper
Advertisement

Rocking Rakesh: కేసీఆర్ సినిమాతో నష్టాలు… తప్పుడు వార్తలపై ఫైర్ అయిన రాకేష్.. ఏం జరిగిందంటే?

Rocking Rakesh: కేసీఆర్ సినిమాతో నష్టాలు… తప్పుడు వార్తలపై ఫైర్ అయిన రాకేష్.. ఏం జరిగిందంటే?
Advertisement

Rocking Rakesh: రాకింగ్ రాకేష్ పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంలో కమెడియన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకేష్(Rakesh) అనంతరం సినిమాలలో అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం పలు బుల్లి తెర కార్యక్రమాలతో పాటు సినిమా పనులలో కూడా రాకేష్ బిజీగా ఉన్నారు. ఇటీవల నిర్మాతగా హీరోగా కూడా మారిన సంగతి తెలిసిందే.గత ఎన్నికలకు ముందు కేసీఆర్(కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అలాగే ఆహాలో కూడా ప్రసారమవుతుంది.

కేసీఆర్ సినిమా చేసి సంక నాకీ పోయా..

ఇక ఈ సినిమా విషయంలో రాకేష్ పై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. ఇటీవల ఒక వార్తాపత్రికలో ఈయన గురించి తప్పుడు వార్తలను రాస్తూ.. “కేసీఆర్(KCR) సినిమా చేసి సంక నాకీ పోయా” అనే హెడ్డింగ్ తో ఉన్న ఒక పేపర్ క్లిప్ షేర్ చేస్తూ ఈ వార్తలపై స్పందించారు. ఈ సినిమా గురించి స్వయంగా కేసీఆర్ తనని ఫామ్ హౌస్ కి పిలిపించి సినిమా చేయమని చెప్పారని, సినిమా చేసే ఆర్థిక స్థోమత తనకు లేకపోయినా కేసిఆర్ స్వయంగా డబ్బును ఇచ్చే సినిమా చేయించారని సినిమాకు నష్టాలు రావడంతో కనీసం కెసిఆర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అంటూ ఈ పేపర్ క్లిప్ షేర్ చేస్తూ ఈయన అసలు విషయం తెలిపారు.

కేసీఆర్ సినిమా వల్ల నష్టాలు లేవు..

Advertisement

ఇలా తన గురించి తన సినిమా గురించి గత కొద్ది రోజుల నుంచి ప్రచారం అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలను నేను చూసి చూడనట్టు వదిలేసాను. ఈ వార్తల కారణంగా కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అందుకే ఈ వార్తలపై స్పందించాల్సి వచ్చిందని తెలిపారు.. ముందుగా కేసిఆర్ సినిమా చేయడం కోసం నేను ఎవరిని సంప్రదించలేదు. నా సొంత డబ్బుతో నేనే స్వయంగా స్క్రిప్ట్ రాసుకొని సినిమా చేశాను. ఈ సినిమా ద్వారా నాకు మంచి లాభాలు వచ్చాయి. ఆహా కూడా మంచి పేమెంట్ వచ్చిందని రాకేష్ తెలిపారు.

మరో స్క్రిప్ట్ కూడా సిద్ధం..

Advertisement

ఈ సినిమా కారణంగా నేనేదో ఇబ్బందులు పడుతున్నానంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని, ఈ సినిమా ద్వారా నేను నా కుటుంబమంతా సంతోషంగా ఉన్నాము అయితే ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరొక స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశానని త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి అన్ని విషయాలను అధికారికంగా తెలియజేస్తానని తెలిపారు. అలాగే ఇటీవల తిరుమలలో తన కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ఓ మహిళ వచ్చింది అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కూడా రాకేష్ ఖండించారు. ఆమె ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన అమ్మ అని, తనని తన కూతురిని ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించడానికి దగ్గరికి వచ్చిందే తప్పా దీనిని కూడా వాళ్లకు అనుగుణంగా మార్చుకొని వార్తలు రాశారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ రాకేష్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: Jani Master -Chinamyi: జానీ మాస్టర్ పై కేసు.. మరో  ట్వీట్ వేసిన చిన్మయి..మాస్టర్ భార్య కూడా!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×