E-Paper
Advertisement

Film industry: సినిమాల్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్న ఫైర్ బ్రాండ్.. ఈసారి రెట్టింపు వేగంతో!

Film industry: సినిమాల్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్న ఫైర్ బ్రాండ్.. ఈసారి రెట్టింపు వేగంతో!
Advertisement

Film industry:సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ గా ముద్ర వేయించుకొని.. ఆ తర్వాత తన నటనతో తానేంటో నిరూపించుకొని గోల్డెన్ లెగ్ గా మారి సంచలనం సృష్టించింది ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా (Roja). తనదైన నటనతో.. అందంతో.. చలాకీతనంతో ప్రేక్షకులను మించిన ఈమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫైర్ బ్రాండ్ గా పేరు దక్కించుకుంది. లీడింగ్ పార్టీలలో స్థానం సంపాదించుకొని మంత్రిగా కూడా పనిచేసి.. సినిమాల ద్వారా తనను ఆదరించిన ప్రజలకు రాజకీయాల్లోకి అడుగు పెట్టి సేవ చేసి మంచి పేరు దక్కించుకుంది. అయితే ప్రస్తుతం మాజీ మంత్రిగా కొనసాగుతున్న ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఎంతో ఆశగా కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈమె మళ్లీ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయిపోయింది.

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న సీనియర్ హీరోయిన్..

వాస్తవానికి ఈమె కూతురు అన్షు మాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని, అలాగే ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్ళబోతోంది అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలన్నింటికీ చెక్ పెట్టింది రోజా. ఇక ఇప్పుడు ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అయితే ఈసారి మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ ను కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పవర్ ఫుల్ గా మొదలు పెట్టారని తెలుస్తోంది. కేవలం ఒక సినిమాతోనే కాకుండా అక్కడే వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు సంతకం చేస్తూ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది రోజా.

ఈసారి డీ గ్లామరస్ పాత్రలో..

Advertisement

ఇక రోజా నటించబోయే ఆ కొత్త సినిమా విషయానికి వస్తే.. ‘లెనిన్ పాండియన్’. శాంతనం అనే పాత్రతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతోంది. సాధారణంగా గ్లామరస్ పాత్రలకు పెట్టింది పేరు రోజా.. అలాంటిది ఈసారి భిన్నంగా డీ గ్లామరస్ పాత్రలో రోజా కనిపించబోతోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే నటిగా ఆమెలోని నటనకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే లెనిన్ పాండియన్ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే మరో భారీ ప్రాజెక్ట్ లో కూడా ఈమె భాగమయ్యింది. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు పొందిన జమా సినిమా దర్శక నటుడు పారి ఎలవళగన్ దర్శకత్వంలో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తానికి అయితే అటు తమిళ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తోంది.

also read:Samyukta Menon: యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టనున్న సంయుక్త.. ఫస్ట్ లుక్ అదుర్స్..

రోజా కెరియర్..

Advertisement

తొలిసారి 1991లో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ప్రేమ తపస్సు అనే చిత్రంతో రోజా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈమెను తమిళ చిత్ర దర్శకుడు ఆర్కే సెల్వమణి నటుడు ప్రశాంత్ తో కలిసి చంబరుతి అనే చిత్రంతో కోలీవుడ్ కి పరిచయం చేశారు. ఈ సినిమా 1992లో వచ్చింది. ఆ తరువాత శరత్ కుమార్ తో కలిసి సూర్యన్ అనే మరో సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ రెండు చిత్రాలు ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని అందించాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×