// // Pavan Rithu: అంతా అయిపోయింది.. డిమోన్‌కి రీతూ ప్రపోజ్! -->
E-Paper
Advertisement

Pavan Rithu: అయిపోయింది, అంతా అయిపోయింది.. డిమోన్‌కి రీతూ ప్రపోజ్ చేసేసింది!

Pavan Rithu: అయిపోయింది, అంతా అయిపోయింది.. డిమోన్‌కి రీతూ ప్రపోజ్ చేసేసింది!
Advertisement

Pavan Rithu: బిగ్ బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్న డిమోన్ పవన్ (Demon Pavan), రీతూ (Rithu) ప్రేమలో ఉన్నారా? వారిద్దరూ ప్రేమించుకుంటున్నారా? ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారా? అంటే, చెప్పడం కష్టమే కానీ, వాలెంటైన్స్‌డే (Valentine’s Day Special)ని పురస్కరించుకుని డిమోన్ పవన్‌కు, రీతూ ప్రపోజ్ చేస్తున్న వీడియో ఒకటి మాత్రం బాగా వైరల్ అవుతోంది. వారిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే కెమిస్ట్రీతో అందరికీ డౌట్స్ వచ్చేలా చేశారు. డిమోన్ పవన్, రీతూ ఇద్దరూ గొడవ పడటం, కాసేపటికే కలిసిపోవడం వంటివి చూస్తే, వారు నిజంగానే ప్రేమలో ఉన్నారని అనిపించేది. సరే, హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా దూరంగా ఉన్నారా? అంటే అదీ లేదు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇంకా బుల్లితెరపై ఇతర ఈవెంట్స్‌లో కూడా కలిసి పాల్గొంటున్నారు. అలా వారిద్దరూ ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Also Read- Best Telugu Love Songs: ‘నిజమే నే చెబుతున్నా’ నుంచి ‘సహన సహన’ వరకు.. బెస్ట్ 20 తెలుగు లవ్ సాంగ్స్ ఇవే!

లైఫ్‌ని చాలా కలర్ ఫుల్ చేశావు

Advertisement

ఈ వారం జరిగే షో‌ను వాలెంటైన్స్ డే స్పెషల్‌గా నిర్వహిస్తున్నారు. ఈ షోలో పవన్‌కు రీతూ ప్రపోజ్ చేస్తున్నట్లుగా ఓ ప్రోమోని వదిలారు. నిజంగా రీతూ ప్రపోజ్ చేస్తున్న తీరు చూస్తే, ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే అనుమానం మరింతగా బలపడుతుంది. మరి షో కోసం చేశారో.. లేదంటే మనసులోని మాటే రీతూ చెప్పిందో తెలియదు కానీ, ఈ జంట మరోసారి టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. ‘పవన్, అంతకు ముందు ఉన్న రీతూని పూర్తిగా మార్చేసి, ప్లెయిన్‌గా ఉన్న లైఫ్‌ని చాలా కలర్ ఫుల్ చేశావు. ఐ లవ్ యూ’ అంటూ రీతూ ఓ గులాబీ పువ్వు ఇచ్చి మరీ పవన్‌కు ప్రపోజ్ చేసింది. ఈ జంట ‘కింగ్’, ‘క్వీన్’ అని రాసి ఉన్న టీ-షర్ట్‌లను ధరించి స్టేజ్‌పై సందడి చేశారు. ఈ ప్రోమోలో ఇదే హైలెట్‌గా ఉంది. బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత ఈ జంట ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు. ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు. మరి వీరి బంధం ముందు ముందు ఎక్కడి వరకు వెళుతుందనేది మాత్రం చూడాల్సి ఉంది.

Also Read- Supritha: సురేఖ వాణి రెండో పెళ్లి పై సుప్రీత కామెంట్స్… తప్పుగా అర్థం చేసుకున్నారా?

ఫ్రస్ట్రేషన్ ప్రదర్శించడానికి వచ్చాడా!

Advertisement

ఇంకా ఈ ప్రోమోలో రోహిణి ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటుడికి ప్రపోజ్ చేస్తే, ఆయన యాక్సెప్ట్ చేయడం మరో హైలెట్ అని చెప్పుకోవాలి. ఇక ఇదే ప్రోమోలో నైనికకు ఇమ్మానుయేల్ ప్రపోజ్ చేయడానికి వచ్చారు. కానీ, ఆయన ప్రపోజ్ చేయడానికి వచ్చినట్లుగా కాకుండా, ఫ్రస్ట్రేషన్ ప్రదర్శించడానికి వచ్చినట్లుగా చూపించారు. అన్నింటిని విసిరికొడుతున్నాడు ఇమ్ము. నా ప్రేమను ఎవరైనా కించపరిస్తే అని చెబుతూ తనే కించపరుచుకుంటున్నట్లుగా ఇందులో చూపించారు. ఈ షో మాములు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వదనేలా ఈ ప్రోమోని ప్రజంట్ చేశారు. ఈ షో ఆదివారం ఉదయం 11 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.

Also Read- Trivikram: త్రివిక్రమ్‌పై మరోసారి కాపీ ఆరోపణలు…హీరోయిన్ ఎక్స్ప్రెషన్‌తో సహా దించేసిన గురూజీ..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×