// // Betting App Case - ముగిసిన రీతూ, భయ్యా సన్నీ యాదవ్‌ విచారణ -->
E-Paper
Advertisement

Betting App Case: బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ముగిసిన రీతూ, భయ్యా సన్నీ యాదవ్‌ సీఐడీ విచారణ

Betting App Case: బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ముగిసిన రీతూ, భయ్యా సన్నీ యాదవ్‌ సీఐడీ విచారణ
Advertisement

Betting App Case: బెట్టింగ్‌ యాప్‌ వ్యవహరంలో పలువురు సినీ, టీవీ నటీనటులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ స్టార్స్ రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్ తో పాటు టీవీ యాక్టర్స్‌ విష్ణు ప్రియ, రీతూ చౌదరి సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్లు భయ్యా సన్నీ యాదవ్‌, టేస్టీ తేజ ఇలా మొత్తం 29మందిపై ఈ ఏడాది మేలో బెట్టింగ్‌ యాప్‌ కేసు నమోదైంది. అయితే పోలీసు విచారణ అనంతరం ఈ కేసు సీఐడీకి వెళ్లింది. దీంతో కొన్ని రోజులు ఈ కేసులోని నటీనటులు వరుసగా నోటీసులు ఇస్తూ విచారణ ఆదేశిస్తున్నారు.

సీఐడీ ముందు రీతూ, భయ్య సన్నీ యాదవ్

Advertisement

ఇప్పటికే ఈ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాశ్‌ రాజ్, విజయ్‌ దేవరకొండ, యాంకర్‌ విష్ణు ప్రియ వంటి పలువురు సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు.  ఇక తాజాగా ఈ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో బిగ్‌ బాస్‌ ఫేం రీతూ చౌదరి, సోషల్‌ మీడియా ఇన్‌ప్లైయేన్స్‌ భయ్యా సన్నీ యాదవ్‌లు కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ ఇటీవల సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఆదేశం మేరకు మంగళవారం (డిసెంబర్‌ 23) రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ విచారణకు హాజరయ్యారు. రెండు గంటలకు సీఐడీ వారిని విచారించినట్టు సమాచారం.

ముగిసిన విచారణ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు ఎవరెవరు ఎన్ని డబ్బులు తీసుకున్నారని దానిపై ఆరా తీశారు. వారి బ్యాంక్‌ లావాదేవీలపై ఆరా తీసిసిన్టటు సమాచారం. అదేవిధంగా వారి బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్ కి సంబంధించిన కాపీలను సీఐడీకి రీతూ, సన్నీయాదవ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో వారు బెట్టింగ్‌ యాప్స్ చేసినట్టు సీఐడీ ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా బెట్టింగ్‌ యాప్స్ వ్యవహారంలో సీఐడీ ఇప్పటి వరకు మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసి వారిని విచారించింది. ఈ కేసుమలో వారందరి స్టేట్‌మెంట్‌ని కూడా సీఐడీ రికార్డు చేసుకుంది.

Advertisement

Also Read: Actor Tylor Chase: ఒకప్పుడు స్టార్ నటుడు.. ఇప్పుడు వీధుల్లో అడుక్కు తింటున్నాడు

తుది రిపోర్టు సిద్ధం చేస్తున్న సీఐడీ

పలు ఎఫ్ఐఆర్లను ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేయడంతో పాటు, 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్సర్లు విచారించింది. రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్‌ విచారణతో ఈ కేసు విచారణ పూర్తయ్యింది. ఇక బెట్టింగ్‌ యాప్‌ కేసులో సీఐడీ తుది రిపోర్టును తయరు చేయనుంది. సెలబ్రిటీలు ఇచ్చిన వివరాల ఆధారంగా తదుపరి దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. ఈ విచారణలో ఒక్కో సెలబ్రిటీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా ఎంత సంపాదించారని వివరాలు కూడా రాబ్టటింది. వాటికి సంబంధించిన స్టేట్‌మెంట్లను సైతం సీఐడీ పరిశీలించినట్టు సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×