E-Paper
Advertisement

Rishabh Shetty: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో రిషబ్ శెట్టి సినిమా, ఆ పుస్తకమే ఇన్స్పిరేషన్

Rishabh Shetty: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో రిషబ్ శెట్టి సినిమా, ఆ పుస్తకమే ఇన్స్పిరేషన్
Advertisement

Rishabh Shetty: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఒకటి. 2025వ సంవత్సరం మినహాయిస్తే గతంలో ఈ బ్యానర్ నుంచి చాలా మంచి సినిమాలు వచ్చాయి. సార్, జెర్సీ, లక్కీ భాస్కర్ వంటి ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. అయితే కేవలం తెలుగు హీరోలను మాత్రమే నమ్ముకోకుండా ఈ బ్యానర్ మిగతా భాషలో ఉన్న టాప్ హీరోస్తో సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

ఇప్పటికే ధనుష్ , దుల్కర్ సల్మాన్ వంటి హీరోలు తెలుగులో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ హీరో రిషబ్శెట్టి హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక రీసెంట్గా విడుదలైన కాంతారా చాప్టర్ వన్ సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబెట్టింది. ఇప్పుడు రిషబ్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

రిషబ్ శెట్టితో సినిమా

Advertisement

రీసెంట్ టైమ్స్ లో చాలామంది దర్శకులు పురాణాల నుండి వేదాల నుండి ఇన్స్పైరై కొన్ని క్యారెక్టర్లతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలా మొదలు పెట్టడమే కాకుండా ఆ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా పుస్తకాల నుంచి ఇన్స్పైర్ అవ్వడం కూడా మొదలెడుతున్నారు.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో రిషబ్ శెట్టి హీరోగా ఓ సినిమా రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదో యోధుడి క‌థ‌. చరిత్రలో మ‌రుగున ప‌డిపోయిన ఓ పోరాట గాథ‌. బంకిం చంద్ర‌ చ‌ట‌ర్జీ ర‌చించిన ‘ఆనంద్ మ‌ఠ్‌’ అనే పుస్త‌కం నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఈ క‌థ‌ని ద‌ర్శ‌కుడు అశ్విన్ గంగ‌రాజు రూపొందించిన‌ట్టు స‌మాచారం. 2026 వేస‌విలో షూటింగ్ ప్రారంభిస్తారు. దీని గురించి త్వరలో అధికారకు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

పాత రోజులు మళ్లీ వచ్చాయి 

Advertisement

పాత రోజుల్లో పుస్తకాలనుంచి ఇన్స్పైర్ అవుతూ చాలామంది దర్శకులు సినిమాలు చేసే వాళ్ళు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ అనే సినిమా కూడా మీనా అనే పుస్తకం నుంచి ఇన్స్పిరేషన్ గా చేసుకొని తీసిందే. అధికారికంగానే వాటి హక్కులు తీసుకొని ఆ పుస్తకాన్ని సినిమాలుగా నిర్మించేవారు. తర్వాత కాలంలో అది కంప్లీట్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు మాత్రం పుస్తకాలలోని కొన్ని క్యారెక్టర్స్ కి దర్శక నిర్మాతలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు.

ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సహాయంతో ఆ కథలనే స్క్రీన్ మీదకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ రిషబ్ శెట్టి తీయబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే తమిళ్ మలయాళం స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్.

Also Read: Megastar Chiranjeevi : బ్రదర్ వెంకటేష్ ఆ పది రోజులు నేను మర్చిపోలేను, విక్టరీ పై మెగాస్టార్ కామెంట్స్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×