// // Rishab Shetty - తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి -->
E-Paper
Advertisement

Rishab Shetty: బ్యాన్ ఎఫెక్ట్… తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి

Rishab Shetty: బ్యాన్ ఎఫెక్ట్… తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి
Advertisement

Rishab Shetty Hire Telugu Tutor: కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టి ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. కాంతార మూవీతో నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు పొందారు. ఆయన స్వీయ దర్శకత్వం తెరకెక్కిన కాంతార: చాప్టర్‌ 1 ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. కేవలం 12 రోజుల్లోనే రూ. 675 కోట్లకు పైగా వసూళ్లు చేసి బాహుబలి రికార్డును బ్రేక్‌ చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఊహించని రెస్సాన్స్‌ అందుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది.

రిషబ్‌కు చేదు అనుభవం

Advertisement

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ టైంలో రిషబ్‌ శెట్టికి తెలుగు ఆడియన్స్‌ నుంచి చేదు అనుభవం ఎదురైంది. తెలుగులో సినిమాను ప్రమోట్‌ చేస్తూ కన్నడలో మాట్లాడారు. దీంతో తెలుగు ఆడియన్స్‌ నుంచి రిషబ్‌కి వ్యతిరేకత ఎదురైంది. కాంతార సినిమాను తెలుగులో బ్యాన్‌ చేయాలంటూ యాంటి ఫ్యాన్స్‌ నుంచి డిమాండ్స్‌ వచ్చాయి. దీంతో తెలుగువారి నుంచి నెగిటివిటీ రావడంతో కాంతార టీం కాస్తా టెన్షన్‌ పడింది. అయితే ఇలాంటి అనుభవం మరోసారి రిపీట్‌ అవ్వోద్దని రిషబ్‌ శెట్టి ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడ. ఇకపై తన మూవీ ప్రమోషన్స్‌లో, సినిమాలో స్వయంగా తానే డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకున్నాడట.

స్టేజ్‌పై తడబడ్డ రిషబ్‌

అయితే ఈ సలహా ఆయన స్నేహితుడు, తెలుగు స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇచ్చాడట. జూనియర్‌ ఎన్టీఆర్‌, రిషబ్‌ శెట్టిల మధ్య మంచి సన్నిహితం ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో వీరద్దరు మంచి స్నేహితులు. కాంతార: చాప్టర్‌ 1 మూవీ ప్రమోషన్స్‌ టైంలోనూ రిషబ్‌, ఎన్టీఆర్‌ను ప్రత్యేకగా పిలిచి తమ పంజుర్లీ దేవాయాలనికి తీసుకువేళ్లాడు. తెలుగులో కాంతార మూవీ ప్రమోషన్స్ టైంలో ఎన్టీఆర్ రిషబ్‌ వెంటే ఉన్నాడు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ టైంలో స్టేజ్‌ రిషబ్‌ తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ఇంగ్లీష్‌, కన్నడలో తన స్పీచ్‌ని కొనసాగించాడు. దీనిపై తెలుగు ఆడియన్స్‌ నుంచి అభ్యంతరాలు వచ్చాయి.

Advertisement

Also Read: Rishab Shetty: హ్యట్సాఫ్ రిషబ్‌ శెట్టి.. క్లైమాక్స్‌ సీన్‌ కోసం ఇంతలా కష్టపడ్డారా?

ఎన్టీఆర్‌ కీలక సూచన

కాంతారను తెలుగులో బ్యాన్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న నిరసనలు వచ్చాయి. ఇలాంటి సంఘటన మరోసారి రిపీట్‌ అవ్వకుండ ఉండాలంటే రిషబ్‌ని తెలుగు నేర్చుకోమని సూచించాడట తారక్‌. అంతేకాదు ట్యూటర్‌ని కూడా స్వయంగా తారకే వెతికి పెట్టాడట. ఎన్టీఆర్‌ సలహా మేరకు రిషబ్‌ ట్యూటర్‌ని నియమించుకుని తెలుగు అభ్యసించుకోబుతున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం.. రిషబ్‌కి ఇక అన్ని భాషల్లో తిరుగు ఉండదు. ఇక ఆయన ఒరిజినల్‌ వాయిస్‌ని తెలుగులోనూ వినబోతున్నామంటూ ఫ్యాన్స్‌ అంత ఖుష్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియా హాట్‌ టాపిక్‌గా మారింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×