// // Kantara Chapter 1 Trailer - గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్‌... కానీ.. -->
E-Paper
Advertisement

Kantara Chapter 1 Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్‌… కానీ అసలు పాయింట్ మిస్..!

Kantara Chapter 1 Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్‌… కానీ అసలు పాయింట్ మిస్..!
Advertisement

Kantara Chapter 1 Trailer: కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కాంతార: చాప్టర్‌ 1′. 2022 విడుదలైన సంచలన విజయం సాధించిన కాంతార మూవీకి ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా మెల్లిమెల్లిగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. లుక్‌ పోస్టర్స్‌ తప్పితే.. గ్లింప్స్‌, టీజర్‌ కానీ ఏవి రాలేదు. ఇవేవి విడుదల చేయకుండానే మూవీ టీం ఏకంగా ట్రైలర్‌ లాంచ్‌కి ముహుర్తం ప్రకటించింది. ఈ రోజు(సెప్టెంబర్‌ 22) కాంతార: చాప్టర్‌ 1 ట్రైలర్‌ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఆకట్టుకుంటున్న ట్రైలర్, కానీ!

Advertisement

చెప్పినట్టుగానే ఇవాళ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇక ఎంతోకాలంగా మూవీ అప్‌డేట్‌ కోసం చూస్తున్న మూవీ లవర్స్‌ ట్రైలర్‌తో మంచి ట్రీట్‌ ఫీస్ట్‌ ఇచ్చారు. మూవీలో విజువల్స్‌, సీన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ట్రైలర్‌ నెక్ట్స్‌ లెవెల్లో నిలబెట్టింది. ఇందులోని విజువల్స్‌ చూసి కాంతార టీం శ్రమ కనిపిస్తుందంటూ ఆడియన్స్‌ ప్రశంసిస్తుంది. మొత్తానికి కాంతార: చాప్టర్‌ 1కి సంబంధించిన ఓ మాంచి అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మేకర్స్‌ ఏకంగా ట్రైలర్‌ ట్రీట్‌ ఫిస్ట్‌ ఇచ్చారు. ట్రైలర్‌ లోయాక్షన్‌ సీన్స్‌ చూపించి సర్‌ప్రైజ్ చేశాడు రీషబ్‌ శెట్టి. పంజుర్లి సంస్క్రతిని ప్రధానాంశంగా కాంతార సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కానీ, ప్రీక్వెల్‌ లో అది మిస్‌ అయ్యింది. ట్రైలర్‌ చూస్తుంటే కాంతార: చాప్టర్‌ 1 రాజులకాలం బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుందని తెలుస్తోంది. రాకుమారితో హీరో ప్రేమయాణం, యుద్దం బ్యాక్‌డ్రాప్‌లోనే ట్రైలర్‌ సాగింది. కానీ, ఎక్కడ డెవోషనల్‌ కనిపించలేదు. దీంతో ట్రైలర్‌ చూసినవారంత షాక్‌ అవుతున్నారు. 

అవాంతరాలను సైతం అధిగమించి.. 

Advertisement

అదేంటి సినిమా పంజుర్లి సంస్క్రతిని పక్కన పెట్టారా? అని సందేహాలు వస్తున్నాయి. కాంతార: చాప్టర్‌ 1 అసలు కథ ఏంటనేది తెలియాలంటే రిలీజ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.   ఎప్పుడో సెట్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్‌ కి తరచూ ప్రమాదాలు, ఆటంకాలు ఎదురయ్యాయి. అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండటంతో మూవీ టీంకి కాంతార షూటింగ్‌ సవాలుగా మారింది. ఆడియన్స్‌ మంచి అనుభూతి అందించేందుకు సెట్స్‌ ఏం లేకుండా రియాలిటీ కోసం అడవిలో షూటింగ్ నిర్వహించారు. నగరానికి 200 కిలో మిటర్ల దూరంలో ఉన్న అడవిలో షూటింగ్ జరిపారు. దీంతో మూవీ టీం తరచూ అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనప్పటిక షూటింగ్‌ పూర్తి చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందు రాబోతోంది. 

Also Read: Adira Movie : ప్రశాంత్ వర్మ సెకండ్ సూపర్ హీరో వచ్చేశాడు… కానీ, డైరెక్టరే మారిపోయాడు

ఈ సిసినిమా తొలి పార్ట్‌ కాంతార మొదట ఓ ప్రాంతీయ సినిమాగా విడుదలైంది. కేవలం కన్నడ భాషలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. రిషబ్‌ శెట్టి స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. మూవీకి వస్తున్న రెస్పాన్స్‌ చూసి మేకర్స్‌ ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేశారు. అలా తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితం కేవలకం రూ. 16 కోట్ల రూపొందిన కాంతారా వరల్డ్‌ వైడ్‌గా రూ. 400 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి నిర్మాతలకు డబుల్‌ ప్రాఫిట్స్‌ ఇచ్చింది. అంతటి విజయం సాధించిన కాంతారకు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్‌ అంత ఆసక్తిగా చూస్తున్నారు. మరి అక్టోబర్‌ 2న వస్తున్న ఈ ప్రీక్వెల్‌.. ఆడియన్స్‌ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×