E-Paper
Advertisement

Drishyam 3 : థియేటర్ హక్కులకు 350 కోట్లా? బాలీవుడ్ సినిమాకు ధీటుగా నిలబడుతుందా?

Drishyam 3 : థియేటర్ హక్కులకు 350 కోట్లా? బాలీవుడ్ సినిమాకు ధీటుగా నిలబడుతుందా?
Advertisement

Drishyam 3 : కొన్ని సినిమాలు మీద ఆసక్తి ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. మొదటిసారి ఆ సినిమా చూసినప్పుడు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అంత ఈజీగా మర్చిపోలేము. అలా చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అలాంటి సినిమాల్లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా ఒకటే. మలయాళం లో విడుదలని ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తర్వాత అన్ని భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్ మీనా కలిసి నటించిన నీ సినిమా ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది.

ఎవరు ఊహించని విధంగా ట్విస్టులు మీద ట్విస్టులు ఈ సినిమాలో ఉంటాయి. కేవలం సినిమాలు చూసి విపరీతమైన నాలెడ్జ్ సంపాదించుకొని ఒక క్రైమ్ ఎలా పోలీసుల కంటపడకుండా ఒక మామూలు వ్యక్తి చేశాడు అనేది ఈ సినిమా కథ. అయితే ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసేది న్యాయంగా అనిపిస్తుంది. మరోవైపు పోలీసులు పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చేసింది విపరీతమైన క్రైమ్ అనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి దృశ్యం 2 సినిమా కూడా విడుదలైంది. ఈ సినిమాకి కూడా మంచి ఆదరణ లభించింది.

థియేటర్ హక్కులకు 350 కోట్లు 

Advertisement

ఇక ప్రస్తుతం దృశ్యం 3 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముందు రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. ఆ సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించడంతో ఇప్పుడు రాబోయే సినిమాకు 350 కోట్లు వరకు థియేటర్ హక్కులు సేల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఒకవేళ ఇదే నిజమైతే బాలీవుడ్ సినిమాకి మాలీవుడ్ ఇండస్ట్రీ దీటుగా నిలబడింది అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో చాలా మలయాళం సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక తెలుగు సినిమా మలయాళం సినిమా విడుదలకు రెడీగా ఉంటే మలయాళం సినిమా చూడ్డానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే వాళ్లు తీసే కాన్సెప్ట్ సినిమాలు బాగుంటాయి అనేది అందరికీ ఒక రకమైన స్థాయి నమ్మకం వచ్చేసింది.

తెలుగులో కూడా రానుంది 

Advertisement

మరోవైపు దృశ్యం సినిమాను తెలుగులో కూడా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బంధుమిత్రుల అభినందనలతో అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. కేవలం ఈ టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు మాత్రమే వస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రావాల్సి ఉంది. ఈ సినిమాను కేవలం 6 నెలల్లోనే పూర్తిచేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్.

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో మొదలుకానుంది. విక్టరీ వెంకటేష్ కు త్రివిక్రమ్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి అద్భుతమైన సినిమాలు రాశారు.

Also Read: Epic Movie : బేబీ జంట చేస్తున్న కొత్త మూవీ ‘ఎపిక్’.. రిలీజ్ అయ్యక ఎపిక్ హిట్ అవుతుందా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×