E-Paper
Advertisement

Renu Desai: నన్ను కాపాడటానికి నా భర్త లేడు… అందుకే అక్కడికి వెళ్తా

Renu Desai: నన్ను కాపాడటానికి నా భర్త లేడు… అందుకే అక్కడికి వెళ్తా
Advertisement

Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగా, సినీనటిగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే బద్రి సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం పవన్ కళ్యాణ్ తో కలిసి మరోసారి జానీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాల సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీకి దూరమైన ఈమె కొన్ని కారణాలవల్ల పవన్ కళ్యాణ్ తో కూడా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కు దూరంగా తన పిల్లల బాగోగులను చూసుకుంటూ తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.

వీధి కుక్కల విషయంలో రేణు దేశాయ్ ఫైర్..

ఇటీవల ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలలో నటిస్తున్న రేణు దేశాయ్ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు మరోవైపు సోషల్ సర్వీస్ చేస్తూ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. రేణు దేశాయ్( Renu Desai) జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే. జంతువులను ఎవరైనా హింసిస్తే ఈమె తన గళం వినిపిస్తారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో వీధి కుక్కలను చంపేస్తున్న ఘటనలపై ఈమె స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల డాగ్ ప్రెస్ క్లబ్ కాన్ఫరెన్స్ లో భాగంగా రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

పిల్లలను టార్గెట్ చేస్తూ విమర్శలు..

Advertisement

ఈ విధంగా రేణు దేశాయ్ కుక్కలను చంపుతున్న అంశం గురించి ఘాటుగా స్పందించడంతో ఈమె తీరుపై విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఏకంగా రేణు దేశాయ్ పిల్లలను కూడా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తనపై వచ్చిన విమర్శల గురించి ఇటీవల ఈమె స్పందించారు. వీధి కుక్కల అంశం గురించి తాను మాట్లాడటంతో చాలామంది నా పిల్లలకు కూడా కుక్కలు కరవాలని, వారు చనిపోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు దయచేసి ఇలాంటి నీచమైన కామెంట్లు పెట్టకండి అంటూ రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ మరోసారి తన ఆవేదన మొత్తం బయటపెట్టారు.

?igsh=dmwwb3RzZDd6d3M0

Advertisement

ఇలా ఇంస్టాగ్రామ్ వేదికగా రేణు దేశాయ్ ఒక వీడియోని షేర్ చేస్తూ “తనని కాపాడటానికి ఎవరూ లేరని, నన్ను కాపాడటానికి అమ్మా నాన్నలు అన్నయ్య, భర్త ఎవరు లేరు. వీధి కుక్కల విషయంలో నా తప్పు లేకపోయినా ఎంతో మంది నన్ను విమర్శిస్తున్నారు. మీరు చేసే ఈ వ్యాఖ్యలపై తిరిగి నేను స్పందించను. నేను నమ్మి భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధను మొత్తం బయట పెడతాను. అందుకే నేను తరచూ కాశీకి వెళ్తాను” అంటూ రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ పై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ నుంచి బిగ్ అప్డేట్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×