E-Paper
Advertisement

అమ్మగా ప్రమోట్ అయిన టాలీవుడ్ బ్యూటీ..పాప ఫోటోలు వైరల్!

అమ్మగా ప్రమోట్ అయిన టాలీవుడ్ బ్యూటీ..పాప ఫోటోలు వైరల్!
Advertisement

Reba Monica:రెబా మోనికా జాన్…తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేసింది. ‘సామజవరగమనా’సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకున్నఈ ముద్దుగుమ్మ.. తాజాగా అమ్మగా ప్రమోట్ అయింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.

జూలై 22న రెబా మోనికా జాన్ పాపకు జన్మనిచ్చింది. తమ చిన్నారి కూతురికి కియారా జోసెఫ్ అని పేరు పెట్టినట్లు తెలిపింది. తన భర్త జోయిస్టన్ క్రిస్టోఫర్‌తో కలిసి పేరెంట్‌హుడ్‌లోకి అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు.

Advertisement

 చిన్నారి కియారా జోసెఫ్‌కి స్వాగతం

తన కూతురిని పరిచయం చేస్తూ రెబా పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. “హలో వరల్డ్.. మా చిన్నారి కియారా జోసెఫ్‌కి స్వాగతం. మా జీవితాల్లోకి వచ్చిన చిన్న సూర్యకిరణం తను. గత కొన్ని రోజులుగా ఈ కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాం. ఒక కొత్త ప్రాణానికి జన్మనివ్వడం అనేది నిజంగా అద్భుతమైన విషయం” అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.

Advertisement

తల్లి అయిన తర్వాత ప్రతి క్షణం కొత్తగా అనిపిస్తోందని  తెలిపింది రెబా. గత తొమ్మిది నెలల పాటు తన బిడ్డ తనలో భాగంగా ఉండటం ఓ ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పింది. ఇక తన భర్తతో కలిసి కూతురితో ఎన్నో అందమైన జ్ఞాపకాలు సృష్టించుకోవాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘సామజవరగమనా’

ఇక రెబా మోనికా జాన్‌కు తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘సామజవరగమనా’. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా 2023 జూన్ 29న థియేటర్లలో విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు.సినిమాలో రెబా తన నటనతో అందరినీ మెప్పించింది.

అయితే రెబా మోనికా జాన్ తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు. మలయాళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. 2016లో వచ్చిన ‘జాకోబింటే స్వర్గరాజ్యం’సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళంలో పలు సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

తమిళంలో కూడా రెబా మంచి అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా స్టార్ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ (2019) సినిమాలో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత పలు భాషల్లో సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను కొనసాగించింది.

జోయిస్టన్ క్రిస్టోఫర్‌ తో వివాహం 

సినిమాల్లో మంచి గుర్తింపు వస్తున్న సమయంలోనే రెబా తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు వేసింది.జోయిస్టన్ క్రిస్టోఫర్‌ను వివాహం చేసుకున్న ఆమె.. ఇప్పుడు తల్లిగా జీవితంలో మరో కొత్త చాప్టర్ ని మొదలెట్టింది.ఇక తాజాగా రెబా తన కూతురు ఫోటోలు, తల్లిగా తన అనుభవాన్నిషేర్ చేయడంతో మురిసిపోతున్నారు మూవీ లవర్స్.

also read :సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×