// // Tollywood - సమ్మె వెనుక భారీ కుంభకోణం.. ఛాంబర్‌,చిత్రపురి ఎన్నికలు అడ్డుకునేందుకే ఈ కుట్ర -->
E-Paper
Advertisement

Tollywood: సమ్మె వెనుక భారీ కుంభకోణం.. ఛాంబర్‌,చిత్రపురి ఎన్నికలు అడ్డుకునేందుకే ఈ కుట్ర

Tollywood: సమ్మె వెనుక భారీ కుంభకోణం.. ఛాంబర్‌,చిత్రపురి ఎన్నికలు అడ్డుకునేందుకే ఈ కుట్ర
Advertisement

Reason Behind Cine Workers Strike: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు సరైన హిట్స్‌ లేక బాక్సాఫీసు కష్టాలు.. మరోవైపు కార్మికుల సమ్మె. సినీ కార్మికుల సమ్మె వల్ల టాలీవుడ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద హీరోలు, బడా నిర్మాతల సినిమాలు తప్పితే.. మీడియం, చిన్న సినిమాల షూటింగ్స్‌ అన్ని ఆగిపోయాయి. దీంతో నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. వేతనాలు పెంపులు నిర్మాతలు హామీ ఇవ్వాలని, లేదంటే సమ్మె విరమించేది లేదని అంటున్నారు. మరోవైపు నిర్మాత ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఇస్తున్నామని పెంచే ప్రసక్తి లేదని తేల్చేస్తున్నారు.

Advertisement

సమ్మె వెనక నాయకుల కుంభకోణం

దీంతో నిర్మాతల తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్స్‌ని అడ్డుకుంటూ.. పనిలోకి వెళ్తున్నవారిని బెదిరిస్తున్నారు. అయితే ఈ కార్మికుల సమ్మె వెనుక పెద్ద కుంభకోణం ఉందంటున్నారు. ఈ సమ్మె వల్ల నష్టపోయేది కార్మికులే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వీరిని అడ్డుపెట్టుకుని యూనియన్‌ నాయకులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. తాను కార్మికుల పక్షపాతిని అని చెప్పుకునే నాయకులే వారికి ద్రోహం చేస్తున్నారు. నరబలి, కోబలి అంటూ కార్మికులను రెచ్చగొడుతున్నారు. అయితే ఈ సమ్మె వెనుక పెద్ద కుట్రకోణం ఉందట. యూనియన్లకు ప్రభుత్వం కొన్ని నిబంధలు పెట్టింది. సమ్మెకు వెళ్లాలంటే ముందస్తుగా నోటీసు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనను ఫెడరేషన్‌ తోసిపుచ్చుతూ.. రాత్రి రాత్రే సమ్మెకు పిలుపునిచ్చింది. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.

Advertisement

ఆ ఎన్నికలు ఆపేందుకే ఇదంత

అయితే ఈ సమ్మె వెనకు ఛాంబర్‌ ఎలక్షన్స్‌, చిత్రపురి కాలనీ ప్రెసెడెంట్‌ ఎన్నికలు ఆపేందుకే ఈ కుట్ర పన్నారంటున్నారు ఇండస్ట్రీ పండితులు. కార్మికుల కోసం పోరాటం చేస్తున్నట్టు యూనియన్‌ లీడర్లు పైకి చేస్తున్నంత ఉట్టి నాటకమని, దీనిక వెనక కొందరి నాయకుల స్వార్థపూరితమైన ఆలోచనలు దాగి ఉన్నాయట. ఛాంబర్‌ ఎలక్షన్స్‌ జరగకుండ ప్రస్తుతం ఉన్న సెక్రటరీ, ప్రెసెడెంట్‌ పద్మభూషణం.. మరోవైపు చిత్రపురి కాలనీలో వల్లభనేని అనిల్ ప్రెసిడెంట్‌ ఎన్నికలు జరగకుండ చేయడానికి సడెన్‌గా ఈ సమ్మెని నిర్వహించారట. అందుకే ముందస్తు నోటీసు లేకుండ ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. మరోవైపు చిత్రపురి కాలనీ ప్లాట్‌ అమ్మాకాల్లో కార్మికులను మోసం చేస్తున్నారు.

తక్కువ ధరకు సినీ కార్మికుల ప్లాట్స్‌ అమ్మేలా ప్రభుత్వం చిత్రపురి కాలనీ భూములను కేటాయించింది. అంతేకాదు ఒక స్క్వేర్‌ ఫీట్‌ ఇంతే అమ్మాలని ధరలను కూడా నిర్ణయించారు. కానీ కార్మికుల కోసమే కేటాయించిన ఈ భూమిని స్క్వేర్‌ ఫీట్‌కు రూ. 7వేల చొప్పున ధర నిర్ణయించి కార్మికుడు కొనలేని పరిస్థితులు తీసుకువస్తున్నారు. లా 800 sftలో డబుల్‌బెడ్‌ రూమ్స్‌ కట్టి స్క్వేర్‌ ఫీట్‌కు రూ. 4వేల చొప్పున కార్మికుడికి ఇవ్వోచ్చు. కానీ, అలా చేయకుండ ఎక్కువ ధరలు పెట్టి ఎన్‌ఆర్‌ఐలకు అమ్మాలనే కుట్ర జరుగుతోంది. ప్రస్తుతం చిత్రపురి కాలనీ భూమి వివాదం కోర్టు పరిధిలో ఉంది. అలాంటి భూమిలో ఆగష్టు 17న చండీహోమం నిర్వహించి.. భూమి పూజ చేస్తానడటం విడ్డూరంగా ఉంది. ఇలా యూనియన్‌ నాయకులు కార్మికుల వెనుక భారీ కుంభకోణం, సమ్మె పేరుతో కుట్రలు చేస్తూ వారిని బలి చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×