E-Paper
Advertisement

RAW NTR సంచలన నిర్ణయం.. సంస్థ మూసివేత!

RAW NTR సంచలన నిర్ణయం.. సంస్థ మూసివేత!
Advertisement

RAW NTR: రా ఎన్టీఆర్ సంస్థ నిర్వాహకులు సడన్ గా తమ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారిక ఎక్స్ వేదికగా ప్రకటించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది ఎన్టీఆర్ అభిమానుల ఒత్తిడా? లేక ఎన్టీఆర్ కార్యాలయం నేరుగా సంప్రదించిందా ? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే తమ సేవలను నిలిపి వేస్తున్నామని ప్రకటించిన ఆ సంస్థ.. ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రా ఎన్టీఆర్ సంస్థ మూసివేస్తున్నట్లు ప్రకటన..

ఊరు – వాడ పేరుతో సుమారుగా రూ.100 కోట్ల సేవా యజ్ఞం చేపడుతున్నట్లు రా ఎన్టీఆర్ సంస్థ ఆర్గనైజర్ సాయి రూప్ తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే తిరుపతిలో ప్రెస్ మీట్ పెడతామని , జూలై 18వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుందని రా ఎన్టీఆర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసిన వెంటనే.. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలయ్యింది. రా ఎన్టీఆర్ సంస్థకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే అవేవీ పట్టించుకోకుండా రా ఎన్టీఆర్ సంస్థ చెప్పినట్టుగానే జులై 18వ తేదీన పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా సాయి రూప్.. అభిమాని అంటే నలుగురికి ఉపయోగపడాలి అనే ఎన్టీఆర్ మాటను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఒకవేళ ఎన్టీఆర్ వద్దని చెబితే ఇప్పుడే ఆపేస్తామని కూడా చెప్పిన విషయం తెలిసిందే.

సాయి రూప్ సరైన సమాధానం ఇవ్వలేదంటూ విమర్శలు..

Advertisement

అయితే ఇప్పుడు రా ఎన్టీఆర్ సంస్థ మూసి వేయడానికి గల కారణం తెలియదు. కానీ రూ .100 కోట్లు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న ప్రశ్నలకు సాయి రూప్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ కృష్ణ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. రా ఎన్టీఆర్ సంస్థకు మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఇక ప్రెస్ మీట్ అనంతరం రా ఎన్టీఆర్ సంస్థ పై విమర్శలు మరింత పెరిగాయి. దీంతోనే తమ సేవలను నిలిపివేస్తున్నామని రా ఎన్టీఆర్ సంస్థ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ALSO READ:సీజేపీ ఉద్యమం.. విద్యార్థులకు అండగా ప్రముఖ సెలబ్రిటీలు!

ఆ వ్యక్తుల వల్లే మూసివేస్తున్నారా?

Advertisement

ఇకపోతే ఇదంతా బాగానే ఉంది కానీ ఇందులో విజయం సాధించిన వారికి మా అభినందనలు అంటూ నమస్కరిస్తున్న ఒక ఏమోజీని రా ఎన్టీఆర్ ట్వీట్ చేసింది. మరొకవైపు సాయి రూప్ ఊరు వాడ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయాలని ముగ్గురు బలమైన వ్యక్తులు పోరాడుతున్నారు అంటూ తనదైన శైలిలో ప్రెస్ మీట్ లో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు వారి మాటలు నిజమయ్యాయా.. నిజంగానే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడానికి కొన్ని శక్తులు పోరాడాయా? అందుకే రా ఎన్టీఆర్ ఇలాంటి పోస్ట్ పెట్టిందా ? అంటూ ఇలా పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే రా ఎన్టీఆర్ సంస్థ మళ్ళీ అధికారికంగా స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×