E-Paper
Advertisement

Mass Jathara: మాస్ మహారాజ్ తో రచ్చ చేసిన హైపర్ ఆది, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

Mass Jathara: మాస్ మహారాజ్ తో రచ్చ చేసిన హైపర్ ఆది, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్
Advertisement

Mass Jathara: మెగాస్టార్ చిరంజీవి చాలామందికి ఇన్స్పిరేషన్. మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న చాలామంది హీరోలు వేరే వాళ్లకు కూడా ఇన్స్పిరేషన్ గా మారారు. వాళ్లలో రవితేజ, నాని కూడా ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కెరియర్ మొదలు పెట్టిన వీళ్లిద్దరూ కూడా తెలుగు సినిమా పరిశ్రమలో వీళ్ళకంటూ ఒక సొంత స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు.

రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తరుణంలో నిన్ను ఒక స్టార్ హీరోని చేస్తాను అని పూరి జగన్నాథ్ చెప్పాడు. ఆ మాటలను రవితేజ సీరియస్ గా తీసుకోలేదు. కానీ పూరి జగన్నాథ్ వాటిని సీరియస్ గా తీసుకొని రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చాడు. రవితేజ ఎన్ని సినిమాలు చేసినా కూడా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలే బాగా పాపులర్.

మాస్ మహారాజ్ తో రచ్చ

Advertisement

ప్రస్తుతం రవితేజ భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అలానే ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ కూడా మంచి అంచనాలను రేకెత్తించింది. ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసినప్పుడు అందరూ సప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ పాటను చక్రి పాడినట్లు క్రియేట్ చేశారు.

రవితేజ, పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. వాళ్ళ ఆల్బమ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. అందుకే అదే మాదిరిగా ఈ సినిమా నుంచి పాటను క్రియేట్ చేశారు. పాట కూడా మంచి ఆదరణ సాధించుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ రేపు ప్రకటించనున్నారు.

Advertisement

ఈ రిలీజ్ డేట్ కు సంబంధించి ఒక వీడియోను విడుదల చేస్తారు. ఈ వీడియోలో హైపర్ ఆది మరియు రవితేజ కనిపించనున్నారు. హైపర్ ఆది కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ అనే షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది ఇప్పుడు సినిమాల్లో కూడా బాగా రాణిస్తున్నారు.

ఎప్పుడో రిలీజ్ కావాల్సింది 

వాస్తవానికి ఈ సినిమా ఈపాటికి విడుదల అవ్వాల్సిందే. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సినిమా వాయిదా అవ్వడానికి ఇదే బ్యానర్ లో వచ్చిన కింగ్డమ్ అనే సినిమా కూడా ఒక కారణం అని చెప్పాలి. ఎందుకంటే నాగ వంశీ కింగ్డమ్ సినిమాను బలంగా నమ్మారు. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధిస్తుంది అనుకున్నారు. సినిమాకి ఓపెనింగ్స్ కూడా ఆ స్థాయిలోనే వచ్చాయి కానీ సినిమా మాత్రం ఊహించిన సక్సెస్ సాధించలేదు. అందువలనే ఇదే బ్యానర్ లో రావలసిన ఈ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేశాను.

Also Read: OG success : స్టార్ హోటల్ లో ఓజి సక్సెస్ ఈవెంట్, 12 ఏళ్ల తర్వాత ఆ మూమెంట్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×