E-Paper
Advertisement

Mass Jathara Event : మీకు చిరాకు తెప్పించాను నన్ను క్షమించండి, నా ప్రామిస్ ను నమ్మండి 

Mass Jathara Event : మీకు చిరాకు తెప్పించాను నన్ను క్షమించండి, నా ప్రామిస్ ను నమ్మండి 
Advertisement

Mass Jathara Event : మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా మాస్ జాతర. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ కు సూర్య గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ సినిమా ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని తెలియజేశారు. ముందుగా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ చెప్పారు. భీమ్స్ ఎమోషనల్ స్పీచ్ విన్న తర్వాత ఇంత ఎమోషనల్ అయిపోయావే ఏంటయ్యా బాబు. నీ ఎమోషన్ తగలయ్యా అని రవితేజ టైమింగ్ కు అన్నారు. ఈ సినిమాకి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పారు.

మీకు చిరాకు తెప్పించాను 

Advertisement

స్పీచ్ అంత అయిపోయిన తర్వాత రవితేజ మాట్లాడుతూ సారీ అబ్బాయి మర్చిపోయాను. గత సినిమాలతో మీకు విపరీతంగా చిరాకు తెప్పించాను ఆ విషయం నాకు తెలుసు. కానీ ఈ సినిమాతో అది జరగదు ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అని అభిమానులకు ఒక హోప్ ఇచ్చాడు మాస్ మహారాజా.

మాది బ్లాక్ బస్టర్ కాంబినేషన్

నవీన్ చంద్ర ఈ సినిమాలో శివుడు అనే పాత్రను ప్లే చేశాడు. సినిమాలో నవీన్ చంద్ర క్యారెక్టర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలానే స్టేజ్ పైన నవీన్ చంద్ర డాన్స్ ఇరగదీసావ్ అంటూ ప్రశంసలు అందించారు. రేపు శివుడు అనే క్యారెక్టర్ గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు నవీన్ చంద్ర ఇరగదీసాడు. ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అదిరిపోతాయి.

Advertisement

రాజేంద్రప్రసాద్ గారితో రాజా ది గ్రేట్ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత ఈ సినిమా కూడా మంచి ఎక్స్పీరియన్స్. శ్రీ లీలా నాది కాంబినేషన్ మరోసారి హిట్ అవ్వబోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మీరు సరికొత్త లీలా చూడబోతున్నారు. మాసి క్యారెక్టర్. సూర్య కంటే ఎక్కువగా నేను వాళ్ళ తమ్ముడు కార్తీ తో కలుస్తుంటాను. ఇప్పుడు కలిసిన తర్వాత ఈయనను కూడా ఇకపై కలుస్తానేమో అనిపిస్తుంది. ఈ సినిమాతో మరో టాప్ దర్శకుడు పరిచయం అవుతున్నాడు అంటూ దర్శకుడు భాను గురించి చెప్పారు.

Also Read: Mass Jathara Event : నాగ వంశీ ను మించిన రివ్యూ రైటర్స్ లేరు, దర్శకుడు సంచలన కామెంట్స్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×