E-Paper
Advertisement

మాస్ మహారాజ్ రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?..

మాస్ మహారాజ్ రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?..
Advertisement

Irumudi Glimpse: మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’ (Irumudi). ఈ సినిమాకు సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ (The Heart of Irumudi) గ్లింప్స్ వీడియోను జూన్ 3, 2026 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శివ నిర్వాణ అనగానే మనకు బలమైన ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా గుర్తుకొస్తాయి. ఈ ‘ఇరుముడి’ చిత్రంలో కూడా యాక్షన్‌తో పాటు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అందుకే ఈ గ్లింప్స్‌కు ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ అనే క్యాప్షన్ ఇచ్చారు.

Read also-బెజవాడ గడ్డపై ‘పెద్ది’ జాతర.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా!

సరికొత్త లుక్‌లో రవితేజ

Advertisement

ఇప్పటివరకు రవితేజను ఎనర్జిటిక్, మాస్ పాత్రల్లోనే చూశాం. కానీ ఈ సినిమాలో ఆయన అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప మాలలో ఒక చేత్తో చిన్నారి పాపను ఎత్తుకుని కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ లేని విధంగా ఒక ఓల్డ్ ఏజ్ లుక్‌లో కూడా కనిపించి భారీ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Read also-Podarillu Today Episode : అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..పెద్దోడికి హిందీ కష్టాలు.. ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. అయ్యో చక్రీ..

Advertisement

ఈ సినిమాలో ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ ‘బంగారు పల్లకి’ ని జి.వి. ప్రకాష్ కుమార్ రీమిక్స్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. జూన్ 3న వచ్చే గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×