E-Paper
Advertisement

Rashmika Mandanna: ఎనిమిదేళ్లుగా వేధింపులు.. 24 గంటల్లో డిలీట్ చేయండి అంటూ రష్మిక వార్నింగ్

Rashmika Mandanna:  ఎనిమిదేళ్లుగా వేధింపులు.. 24 గంటల్లో డిలీట్ చేయండి అంటూ రష్మిక వార్నింగ్
Advertisement

Rashmika Mandanna: పెళ్లయిన రెండు వారాలకె రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వీడియోలు, పోస్టులు మళ్లీ వైరల్ అవుతున్నాయని చెబుతూ రష్మిక తీవ్రంగా స్పందించారు. అవసరమైతే పరువు నష్టం కేసు వేస్తానని కూడా ఆమె హెచ్చరించారు.

రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి జరిగిన తర్వాత.. రష్మికకు గతంలో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వీడియోలు.. పోస్టులు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం రష్మికను తీవ్రంగా బాధపెట్టిందని తెలుస్తోంది.

Advertisement

సోషల్ మీడియాలో కొంతమంది కావాలని పాత వీడియోలను షేర్ చేస్తూ ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మికకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎంగేజ్‌మెంట్ కొన్ని కారణాల వల్ల తరువాత రద్దయింది.

ఇప్పుడు ఆ పాత వీడియోలు మళ్లీ బయటకు తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం రష్మికను ఆగ్రహానికి గురి చేసింది. తన జీవితంలో గతంలో జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ వైరల్ చేయడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్‌లో చేసిన పోస్టులో గత ఎనిమిదేళ్లుగా కొంతమంది తనపై నిరంతరం వేధింపులు చేస్తున్నారని తెలిపారు. వివిధ అకౌంట్ల ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పారు.

ఇకపై ఈ పరిస్థితిని అసలు సహించనని ఆమె స్పష్టంగా ప్రకటించారు. తన కుటుంబాన్ని కూడా ఈ వివాదంలో లాగడం చాలా బాధ కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.

24 గంటలు మాత్రమే టైం..!

వైరల్ అవుతున్న వీడియోలు.. పోస్టులను వెంటనే తొలగించాలని రష్మిక కోరారు. 24 గంటల్లో ఆ కంటెంట్ తొలగించకపోతే పరువునష్టం కేసు వేయాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, పాత విషయాలను తిరిగి వైరల్ చేయడం ఆపాలని ఆమె నెటిజన్లను కోరారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా రష్మిక తెలిపారు.

ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అభిమానులు కూడా రష్మికకు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రిటీలపై ఇలాంటి ట్రోలింగ్ చేయడం సరైంది కాదని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ: Rashmika Mandanna: రక్షిత్ శెట్టితో రష్మిక బ్రేకప్ కు అదే కారణమా? రష్మిక తల్లి కామెంట్స్ వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×