E-Paper
Advertisement

Rashmika : ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయం వేస్తుంది.. పీరియడ్ ట్రోల్స్ పై రష్మిక కామెంట్స్!

Rashmika : ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయం వేస్తుంది.. పీరియడ్ ట్రోల్స్ పై రష్మిక కామెంట్స్!
Advertisement

Rashmika: సినీనటి రష్మిక మందన్న ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక జగపతిబాబు(Jagapathi Babu) హోస్టుగా వ్యవహరించిన జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

అబ్బాయిలకు ఎన్నో బాధలు..

ఈ క్రమంలోనే పురుషులకు పీరియడ్స్(Men’s Periods) రావడం గురించి కూడా రష్మిక మాట్లాడిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు పీరియడ్స్ వచ్చిన సమయంలో చాలా బాధను అనుభవిస్తారు. అలా అమ్మాయిలు పడే బాధ తెలియాలి అంటే అబ్బాయిలకు ఒక్కసారి పీరియడ్స్ రావాలని అప్పుడే ఆ బాధ తెలుస్తుంది అంటూ మాట్లాడారు. ఇలా రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అబ్బాయిలకు పీరియడ్స్ రావడం ఏంటి? అమ్మాయిలకు మాత్రమే బాధ ఉంటుందా? అబ్బాయిలకు ఎన్నో బాధలు ఉంటాయి.. అబ్బాయిలు ఒక వయసుకు వచ్చిన తర్వాత బాధ్యతలతో ఎంతో మెంటల్ టెన్షన్, ప్రెషర్ అనుభవిస్తుంటారని ఈమె వ్యాఖ్యలపై విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అయ్యాయి.

నా ఉద్దేశం అది కాదు..

Advertisement

ఇలా రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఈ విమర్శలపై రష్మిక స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.” ఏదైనా షోలు, ఇంటర్వ్యూలకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. నా ఉద్దేశం వేరు దానిని మరోలా అర్థం చేసుకున్నారు. మగాళ్లకు ఒక్కసారి అయినా పీరియడ్స్ వస్తే మేము అనుభవించే బాధ అర్థమవుతుందనేది నా ఉద్దేశం” అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ రష్మిక చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

ఈ వీడియోలో రష్మిక స్పష్టంగా ఒక్కసారి పీరియడ్స్ వస్తే చాలు అంటూ మాట్లాడినప్పటికీ ఈమెపై విమర్శలు రావడంతో రష్మిక అభిమానులు ఈమెకే పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు. రష్మిక కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె మరో నాలుగు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక రష్మిక వ్యక్తిగత విషయానికి వస్తే త్వరలోనే పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరి వివాహం 2026 ఫిబ్రవరి 26వ తేదీ జరగబోతుందని తెలుస్తోంది.

Also Read: Andhra King Taluka: ఫస్ట్ డే ఫస్ట్ షో లిరికల్ సాంగ్ రిలీజ్ ..రామ్ ఎనర్జీ వేరే లెవెల్ !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×